కుబేర
అనగనగా కథ..అనగనగనగా కథ..అందరికీ తెలిసిన కథ..కానీ అంతే తెలియని కథ.. అనగనగా కథ..అనగనగనగా కథ..అందరికీ తెలిసిన కథ..కానీ అంతే తెలియని కథ.. నమ్మేవాడిని అమ్మేయడం….మొక్కేవాడిని తొక్కేయడం..దొరికేవాడిని దోచేయడం..తల వంచేవాడిని ముంచేయడం.. యుగాల నుండీ..జరుగుతున్న కథ..యుగాంతమైనా మారిపోని కథ.. అనగనగా కథ..అనగనగనగా కథ..అందరికీ తెలిసిన కథ..కానీ అంతే తెలియని కథ.. వంతెన కట్టేదొకడు..దాన్ని దాటే వాడింకొకడు..నిచ్చెన వేసేదొకడు…పైపైకెక్కే వాడింకొకడు..ముందుకు తీసుకు వెళ్ళేవాడిని అక్కడితోనే ఆపడం..ఎత్తుకు మోసుకు వెళ్ళేవాడిని లోతులలోనే ఉంచడం.. పేదల నెత్తుటి మరకలు అంటని పెద్దల సిరి […]








