కింగ్డ‌మ్‌

మృత్యువు జడిసేలా పద పద
శత్రువు బెదిరేలా పద పద
గర్జన తెలిసేలా పద పద
దెబ్బకు గెలిచేలా పద పద

పది తలల రావణుడితో
పోరు కొరకే కదిలాడు
ఇక ఎవడు ఆపగలడు
దహనం చేస్తాడు

తెగబడిన రాక్షసులతో నేడు సహనం మరిచాడు
ఇక ఎవడు ఆపగలడు మరణం రాస్తాడు
చెడునంతమే చేసేలా చెలరేగినదీ జ్వాల
చెరబట్టిన మృత్యువుతోనే యుద్ధం ఈ వేళ
నరమే కొలిమవ్వాలా
నరమేధమే జరగాలా
నరకాసుర రక్తంతోనే నేలే తడవాలా..

రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే
కదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలే
రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే
కదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలే
యెల హేల హేల హే….లా
యెల హేల హేల హే….
యెల హేల హేల హే….లా
యెల హేల హేల హే….
యెల హేల హేల హే…..

మృత్యువు జడిసేలా పద పద
శత్రువు బెదిరేలా పద పద
గర్జన తెలిసేలా పద పద
దెబ్బకు గెలిచేలా పద పద

మృత్యువు జడిసేలా పద పద
శత్రువు బెదిరేలా పద పద
గర్జన తెలిసేలా పద పద
దెబ్బకు గెలిచేలా పద పద

అవమానమే అన్ని వైపులా
పెను ఉప్పెన నిన్ను కూల్చేరా
భగ భగ.. భగ భగ కలలన్ని కాలే కదరా

నడి గుండెలో కత్తి దించగా
ప్రతితి ఇక దూరమయ్యేగా
భగ భగ.. భగ భగ నువ్వు మండుతూనే పదరా

తడి ఉండే కంటిలోనే బడబాగ్నేనింపరా
తరువాతి జాతికైనా సంకెలేలే తెంచరా..
చెడునంతమే చేసేలా చెలరేగినదీ జ్వాల
చెరబట్టిన మృత్యువుతోనే యుద్ధం ఈ వేళ

నరమే కొలిమవ్వాలా
నరమేధమే జరగాలా
నరకాసుర రక్తం తోనే నేలే తడవాలా..

రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే
కదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలే
రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే
కదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలే
యెల హేల హేల హే….లా
యెల హేల హేల హే….
యెల హేల హేల హే….లా
యెల హేల హేల హే….
యెల హేల హేల హే…..

మృత్యువు జడిసేలా పద పద
శత్రువు బెదిరేలా పద పద
గర్జన తెలిసేలా పద పద
దెబ్బకు గెలిచేలా పద పద

సంగీతం: అనిరుధ్ రవిచందర్
సాహిత్యం :
కృష్ణకాంత్
గానం : సిద్దార్థ్ బస్రూర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress