రౌడీ బాయ్.. విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఇంకో షెడ్యూల్ మిగిలి ఉండగా విజయ్ కాలికి గాయం కావడం వల్ల షూటింగ్‌కి బ్రేక్ పడిందట.
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో స్టార్‌డమ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. కానీ ఆ తర్వాత సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. మరో హిట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. కింగ్డమ్ ట్రైలర్ చూసి అందరూ విజయ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. అలాంటి సమయంలో కాలికి గాయం కావడం అతని అభిమానులను, అటు ప్రొడక్షన్ టీమ్ కూడా కంగారు పడుతున్నది.
కింగ్డమ్ సినిమా మొదలైనప్పటి నుంచి విజయ్‌కి ఏదో రకంగా గాయాలు తగులుతూనే ఉన్నాయి. ఒకరోజు మెట్లు దిగుతూ కిందపడిపోయాడు. ఆ సమయంలో పెద్దగా దెబ్బలు తగలలేదు. కానీ ఇప్పుడు కాలికి తగిలిన దెబ్బ బాధించడంతో డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని చెప్పారట. అందువల్లే షూటింగ్‌కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తున్నది.
ఈ సినిమాకి సంబంధించి వారం రోజుల క్రితమే ఆ సినిమా దర్శకుడి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఆ వేడుకల్లో విజయ్ బాగానే ఉన్నాడు. ఆ తర్వాత గాయం తగిలినట్టు చెబుతున్నారు. ఈ సినిమాకి తెలుగులో జూ.ఎన్టీఆర్, తమిళంలో సూర్య, హిందీలో రణ్‌బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. మే 30న విడుదల కాబోతున్న ఈ సినిమాకి గౌతమ్ తిన్నూరి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.