చిన్నతనమే ఏమైపోయే
నన్ను వదిలే నీదే చేయే
అంత కలలాగే కరిగే
కథ కదలక ఆగే
అందమైన గూడే చెదిరే
కష్టమొచ్చినా ఇంకో వైపే
కంటి రెప్పల కాసే కాపే
కొన్ని గుర్తులేవో.. మిగిలే
విధి ఎరగదు జాలే
చిన్న గుండె నాదే.. పగిలే
అన్నా అంటేనే… ఉన్నానంటూనే..
చిన్నోడి కోసం.. నిలబడతావే
అన్నా అంటేనే… ఉన్నానంటూనే..
చిన్నోడి కోసం.. కలబడతావే
చిన్నతనమే ఏమైపోయే
నన్ను వదిలే నీదే చేయే
అంత కలలాగే కరిగే
కథ కదలక ఆగే
అందమైన గూడే చెదిరే
నిశబ్దమే వీడెనుగా..
ఇన్నేళ్లుగా వేచిన వేకువ
వెలుగే వడివడిగా ఇటు నడిచేనా..
నిత్యం ఇలా ఒంటరిగా
ఉన్నానులే ఊపిరి ఆడక
కలనా కలవరమా ఇది నిజమేనా..
అన్నా అంటేనే… ఉన్నానంటూనే..
చిన్నోడి కోసం.. నిలబడతావే
అన్నా అంటేనే… ఉన్నానంటూనే..
చిన్నోడి కోసం.. కలబడతావే
చిన్నతనమే ఏమైపోయే
నన్ను వదిలే నీదే చేయే
అంత కలలాగే కరిగే
కథ కదలక ఆగే
అందమైన గూడే చెదిరే
సంగీతం : అనిరుధ్ రవిచందర్
సాహిత్యం : కృష్ణకాంత్
గానం: అనిరుధ్ రవిచందర్
