నల జిలకర మొగ్గ నా నల జిలకర మొగ్గ
నల జిలకర మొగ్గ నా నల జిలకర మొగ్గ
రూపాయి కావాలా
రూపాయి పువ్వులు కావాలా ?
రూపాయి కావాలా
రూపాయి పువ్వులు కావాలా ?
నా రూపు రేఖ సల్లగుంటే..
అ.. ఎలగా ?
మావ.. నా రూపు రేఖ సల్లగుంటే
రూపాయి ఎందుకు
రూపాయి పువ్వులెందుకు
ఆహా !
నా రూపు రేఖ సల్లగుంటే
రూపాయి ఎందుకు
రూపాయి పువ్వులెందుకు
అవును..
నల జిలకర మొగ్గ నా నల జిలకర మొగ్గ
నల జిలకర మొగ్గ నా నల జిలకర మొగ్గ
రూపాయి కావాలా
రూపాయి పువ్వులు కావాలా ?
అవును అవును
రూపాయి కావాలా
ఆహా !
రూపాయి పువ్వులు కావాలా ?
నా రూపు రేఖ సల్లగుంటే
రూపాయి ఎందుకు
నాకు పువ్వులెందుకు
ఓహో
నా రూపు రేఖ సల్లగుంటే
రూపాయి ఎందుకు
నాకు పువ్వులెందుకు
అవును..
నల జిలకర మొగ్గ నా నల జిలకర మొగ్గ
నల జిలకర మొగ్గ నా నల జిలకర మొగ్గ
పావలా కావాలా ?
పావలా సిల్లర కావాలా ?
పావలా కావాలా ?
పావలా సిల్లర కావాలా ?
నా పాదాలు సల్లగుంటే…
ఆ.. ఏటి సల్లగుంతే..
నా పాదాలు సల్లగుంటే
పావలెందుకు నాయినా సిల్లరెందుకు
అయ్యా నా పాదాలు సల్లగుంటే
పావలెందుకు నాయినా సిల్లరెందుకు
నల జిలకర మొగ్గ నా నల జిలకర మొగ్గ
నల జిలకర మొగ్గ నా నల జిలకర మొగ్గ
సీరలు కావాలా?
సిల్కు సీరలు కావాలా ?
సీరలు కావాలా?
సిల్కు సీరలు కావాలా ?
సిరిగల నీ ముఖము జూస్తే సీరలెదుకు
మావ.. సారెలెందుకు
ఆహా!
సిరిగల నీ ముఖము జూస్తే సీరలెందుకు
మావ.. సారెలెందుకు
అదే
నల జిలకర మొగ్గ నా నల జిలకర మొగ్గ
నల జిలకర నా నల జిలకర మొగ్గ
నా నల జిలకర మొగ్గ నా నల జిలకర మొగ్గ
నా నల జిలకర మొగ్గ….
సంగీతం: చరణ్ అర్జున్
పాట మూలం : ఉత్తరాంధ్ర జనపదాలు
అదనపు సాహిత్యం: జానకిరామ్
గాయకులు: అనన్య భట్, జానకిరామ్, గౌరీ నాయుడు జమ్ము
