త్రిబాణ‌ధారి బార్బ‌రిక్‌

చిరు ప్రాయం కుసుమాలే వీడిపోని హృదయాలే
అనుబంధం పెనవేసే పసిప్రేమై కలిసేలే
చిరునవ్వై విరిసెలే మనసంతా మురిసేలే
అల్లరులే స్నేహాలై సందడిగా మరెనులే..

అనగా అనగా కథలా మొదలైనదిలే మరలా
ఎప్పుడో తనువే విడిన బాల్యమిలా
మనసే ఎగసే అలలా వయసే ఊరికే నదిలా
ఎనభై ఎగిరీ దుమికే పాతికలా
పసితనమే రాలేక బదులుగా నిను పంపిందా
ఈ తాతని మార్చేలా ముడతల బుడతడిగ

అమ్మై ప్రేమందిస్తానే అమ్మని కాకున్నా
నాన్నై నిను నడిపించేందుకు తాతని నేనున్నా
నువ్వే నా ప్రాణంకన్నా ఎక్కువ అంటున్నా
నిన్నే నా ప్రాణం పోనీ విడువను క్షణమైనా

లాలే పోస్తా నీకే జడలే వేస్తా
నింగిలో చుక్కలే నీ తలకి పూలల్లుతా
వానై వస్తా నిన్నే గొడుగై కాస్తా
పడవలే వదులుతూ నీతోటి చిందాడుతా
కంటికే రెప్పల కాయనా కాపలా
నిదురనైన నిన్ను వీడిపోక వస్తా నీ కలలా

చిరు ప్రాయం కుసుమాలే వీడిపోని హృదయాలే
అనుంబంధం పెనవేసే పసిప్రేమై కలిసేలే
చిరునవ్వై విరిసెలే మనసంతా మురిసెలే
అల్లరులే స్నేహాలై సందడిగా మరెనులే..

అనగా అనగా కథలా మొదలైనదిలే మరలా
ఎప్పుడో తనువే విడిన బాల్యమిలా
మనసే ఎగసే అలలా వయసే ఊరికే నదిలా
ఎనభై ఎగిరీ దుమికే పాతికలా
పసితనమే రాలేక బదులుగా నిను పంపిందా
ఈ తాతని మార్చేలా ముడతల బుడతడిగ

అమ్మై ప్రేమందిస్తానే అమ్మని కాకున్నా
నాన్నై నిను నడిపించేందుకు తాతని నేనున్నా
నువ్వే నా ప్రాణంకన్నా ఎక్కువ అంటున్నా
నిన్నే నా ప్రాణం పోనీ విడువను క్షణమైనా

సాహిత్యం : స‌నారె
సంగీతం : ఇన్ప్యూష‌న్ బ్యాండ్‌
గాయ‌కులు :
కార్తీక్‌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress