ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం..
నీదో నీ వల్ల నాదో ఈ పరవశం..
రాగం నీదై పల్లవి నాదై
చరణం చరణం కలిసిన వేళ
ప్రయణాలు ఏ హిమాలయాలకో..
ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం
ఏదో…
అడగను ఎప్పుడు మాయలేడి నడగను ఎప్పుడు..
విడువను ఎప్పుడు అడుగులోన అడుగెడుతూ..
ఎవరెదురైన నిప్పులాంటి నిజమును కొలిచే..
రాముడి కోసం రాయినైనా జానకినై
వెన్నంటే నీడల వేదనలో తోడులా
నాన్నే నా ప్రాణమై నాన్న కలే సత్యమై
నేనే వెతికే తీగే నన్నే వెతుకుతూ వస్తే..
ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం
ఏదో…
తెరలు తెరలుగా తెరుచుకున్న తూరుపు ద్వారం
పొరలు పొరలుగా కరుగుతున్న నిశి భారం
పొడుపు కథల్లో పొంచి ఉన్న నిన్నటి సారం
బదులు తెలిసినా వదలలేని మమకారం
కలలన్నీ హాయిగా కలలాగే తోచగా
కలిసుండే కోరికే చిరుగాలై వీచగా
నాలో తపనే నాకై వేచే విరహ కావ్యంలో
ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం
నీదో నీ వల్ల నాదో ఈ పరవశం
రాగం నీదై పల్లవి నాదై
చరణం చరణం కలిసిన వేళ
ప్రయణాలు ఏ హిమాలయాలకో..
ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం
ఏదో…
సాహిత్యం: యం. యం. కీరవాణి
సంగీతం: ఇళయరాజా
గాయని: అనన్య భట్