క‌పుల్ ఫ్రెండ్లీ

నాలో నేను
తనలో తాను
కలిసే ఉన్నాం విడిగా

కాలమా కాలమా
ఈ వేళని తెల్లారనీకమ్మా
దూరమా దూరమా
రెప్పపాటులో మటుమాయమైపోమ్మా..

ఇందాకా చేరుకుంది ఇందుకేనా
ఇంతేనా కాలమంతా మౌనమేనా
ఇందాకా చేరుకుంది ఇందుకేనా
ఇంతేనా కాలమంతా మౌనమేనా

అదుపో పొదుపో ఒక మాటైనా
అననే అనదా ఒకసారైనా
బెరుకూ బిడియం నిజమే అయినా
పరదా విడదా సరదాకైనా..

నిన్నా మొన్నా తెలిసున్నా
తనతోనే నేను కలిసున్నా
ఈ కొంచెం సంకోచం
ఏంటో నాకైనా..

నాలో నాకు
తనలో తనకు
గొడవే కాని గొడవ

కాలమా కాలమా
ఈ వేళని తెల్లారనీకమ్మా
దూరమా దూరమా
రెప్పపాటులో మటుమాయమై పోమ్మా..

ఇందాకా చేరుకుంది ఇందుకేనా
ఇంతేనా కాలమంతా మౌనమేనా
ఇందాకా చేరుకుంది ఇందుకేనా
ఇంతేనా కాలమంతా మౌనమేనా

సంగీతం : ఆదిత్య రవీంద్రన్
సాహిత్యం : ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి
గాయకుడు : సంజిత్ హెగ్డే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress