కలకలమును కలగలిపిన కథ మొదలా..
హే.. కలవరమున తెగనలిగిన నిజము కలా.. హ..
ఏంచెయను తడబడిన తప్పటడుగా మతిచెడేనా ఏమో..
సతమతమౌ తలపెదో నిలదీసి నన్నడిగెనుగా
ఏం జరుగుతోంది.. ఏం జరుగుతోంది
మనసా తెలుసా.. మనసా.. ఆ
ఏం జరుగుతోంది.. ఏం జరుగుతోంది
తెలిసే కలిసే మనసా.. ఆ
ఏం జరుగుతోంది.. ఏం జరుగుతోంది
ఇకపై ఇది నీ వరసా.. ఆ
ఏ కారణమంటే ఏం పలకని మౌనం
వలపంటే ఇంతేనా ఆ.. ఆశ్చర్యం
నా పదనిస శృతిలోన..
నీ సరిగమ కలిసేన
అర్థలో అపార్ధాలో తెలియకనే పయనం
సరి అని అనుకోవాలో
తగదని దాటేయాలో
నీకైనా తెలిసిందా
తెలుపకనే తెలిపే క్షణమా
ఏం జరుగుతోంది.. ఏం జరుగుతోంది
మనసా తెలుసా మనసా.. ఆ
ఏం జరుగుతోంది.. ఏం జరుగుతోంది
ఇకపై ఇది నీ వరసా.. ఆ
మరిచిత సమ సంబంధం..
సందిగ్ధం.. సత్ సాహిత్యం
మస్తిష్కం భ్రమరా భ్రమరం..
విపదం ద్విముఖం వంచింతం
ఎదుటే ఉన్నా దూరం ఎటు వైపో నా తీరం
ఊహల్లో ఊహించే రూపం ఇది అనుకోవాలా
కలకలమును కలగలిపిన కథమొదలా..
హే.. కలవరమున తెగనలిగిన నిజము కలా.. హ
ఏంచెయను తడబడిన తప్పటడుగా మతిచెడేనా ఏమో..
సతమతమౌ తలపెదో నిలదీసి నన్నడిగెనుగా
ఏం జరుగుతోంది.. ఏం జరుగుతోంది
మనసా తెలుసా మనసా.. ఆ
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది
తెలిసే కలిసే మనసా.. ఆ
ఏం జరుగుతోంది.. ఏం జరుగుతోంది
ఇకపై ఇది నీ వరసా.. ఆ
మరిచిత సమ సంబంధం..
సందిగ్ధం.. సత్ సాహిత్యం
మస్తిష్కం భ్రమరా భ్రమరం విపదం ద్విముఖం వంచింతం
సంగీతం : హేషమ్ అబ్దుల్ వహాబ్
సాహిత్యం : రాకేందు మౌళి
గాయకులు : చిన్మయి శ్రీపాద, హేషమ్ అబ్దుల్ వహాబ్
