వెలుగారునా.. నిశిపూసినా..
వెలివేసినా.. మది వీడునా..
గుండె కనుమూసిన విధి రాసిన కల కాలిపోవు నిజమైనా..
నిన్ను వదలకుమా వదలకుమా… బెదురెరుగని బలమా….
నదివే.. నువ్వు నదివే..
నీ మార్పే రానుంది వినవే..
నదివే.. నువ్వు నదివే..
నీకే నువ్వియ్యాలి విలువే..
సిలువ బరువేమోయకా
సులువు భవితెలీదుగా
వెన్నెల వలదను కలువవు నువ్వు కావా.. కాలేవా..
ఓహో హో.. తడువు గురుతులై ఇలా..
తరుము గతము నావనా..
ఎటు కదలనీ నిమిషం నులిమిన గొంతుకవా..
నటనిక చాలనే..ఎద మోసినా కొన ఊపిరున్న చైతన్యం
నువ్వు వదలకుమా వదలకుమా… సరికోరే నిజమా….
నదివే.. నువ్వు నదివే..
నీ మార్పే రానుంది వినవే..
నదివే.. నువ్వు నదివే..
నీకే నువ్వియ్యాలి విలువే..
మునుముందే వెలుగుంది నిన్నల్లో నిశి దాగున్న
మునుముందే వెలుగుంది దారే ముసుకుపోతున్న
మునుముందే వెలుగుంది ఆగద్దు ఏదేమైనా
మునుముందే వెలుగుంది దాటై ఆటు పోటైనా
మునుముందే వెలుగుంది కలలే విడొద్దంటున్న
మునుముందే వెలుగుంది తెలుపేగా హరివిల్లైనా
మునుముందే వెలుగుంది ఉనికిని మరువద్దంటున్న
మునుముందే వెలుగుంది నీ వెలుగై నేనొస్తున్నా..
నదివే..
సంగీతం : హేషమ్ అబ్దుల్ వహాబ్
సాహిత్యం : రాకేందు మౌళి
గానం : హేషమ్ అబ్దుల్ వహాబ్
