ప‌ర‌దా

మా.. అందాల సిరి మీద పడనీకు ఏ కళ్ళు..
ఆ.. చిరునవ్వే పచ్చంగా ఉండాలి నూరేళ్లు..
వెయ్యాలి పరదాలు చెయ్యాలి సరదాలు..
అమ్మ నీ దీవెనలే తోడుంటే అంతే చాలు..
మా ఊరి పొలిమేర దాటవుగా సంతోషాలు..

ఆ మిల మిల మిల మెరుపల్లే
సిరులొలికెను మన పల్లె
చిరునగవుల సొగసరి వల్లే

ఆ తల తల తల హరివిల్లే
మన ఎదురుగ నడిచెల్లే
ఆ కలగని మనసులు తుళ్లే

అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కుందోగా
ఏ చూపులకందని ఎత్తున చక్కని చుక్క
ఇంకా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు వస్తుందోగా
మా అందరి మధ్యకు అల్లరి సిగ్గుల మొగ్గ

ఆ దివి సీమన పుట్టిందా
దిగి నేలకు వచ్చిందా
ఈ ముంగిట విరబూసిందా
మా చిరు గుండెను తట్టిందా
గిలిగింతలు పెట్టిందా
పలు వింతలు చూపించిందా..

రాముని మించిన రాయడే వస్తాడే
రాణిలా నీకొక్క పల్లకి తెస్తాడే

హేయ్ అందాల బంగారు లేడి పిల్ల
నా ముందుకొచ్చేది ఇంకా కల్లా
ఎందుకు లేవోయ్ పారాణి ఎత్తె
అమ్మడి చేతులో నువ్విక చిత్తే
అంతే.. నీ ఆటలు సాగవు అంతే

ఓ చప్పున మాయం అయిపోతావే
చక చక పరుగులు పెట్టిస్తావే
తూనీగల్లే నువ్వు తుర్రంటావే

ఆ మిల మిల మిల మెరుపల్లె
సిరులొలికెను మన పల్లె
చిరునగవుల సొగసరి వల్లే

కోటి కవచాలల్లే నిన్ను ఇది కాయాలి
నేటి పరదా నీకు రేపటికి తోడవ్వాలి
దేవతల నీడల్లో నిన్ను నడిపించాలి
మన ఊరి వరాల తల్లి నీకు కావలి

గుండెలో ప్రేమకే లేవుగా పరదాలే
అందుకే నా మది నీకిలా పరిచాలే

ఓ నీ ప్రేమ ఎంతుండి ఏమీ లాభం..
కన్నెత్తి చూసింది లేదు రూపం..

దాగుడుమూత దండాకోరు
పిల్లి వచ్చే ఎలక దాక్కో
దాక్కొ దాక్కోవే పిల్ల దాక్కో

అరె నీతో పందెం ఎంతటి చిక్కో
నువ్వే నన్నిక చెంతకు లాక్కో
చెంతకు లాక్కో నీ వద్దకు లాక్కో

ఆ మిల మిల మిల మెరుపల్లె
సిరులొలికెను మన పల్లె
చిరునగవుల సొగసరి వల్లే

ఆ తల తల తల హరివిల్లే
మన ఎదురుగ నడిచెల్లే
ఆ కలగని మనసులు తుళ్లే

అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కుందోగా
ఏ చూపులకందని ఎత్తున చక్కని చుక్క
ఇంకా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు వస్తుందోగా
మా అందరి మధ్యకు అల్లరి సిగ్గుల మొగ్గ

అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కుందోగా
ఏ చూపులకందని ఎత్తున చక్కని చుక్క
ఇంకా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు వస్తుందోగా
మా అందరి మధ్యకు అల్లరి సిగ్గుల మొగ్గ

ఆ మిల మిల మిల మెరుపల్లె
సిరులొలికెను మన పల్లె
చిరునగవుల సొగసరి వల్లె

ఆ తల తల తల హరివిల్లె
మన ఎదురుగ నడిచెల్లే
ఆ కలగని మనసులు తుళ్లే

సంగీతం : గోపీ సుందర్
సాహిత్యం :
వనమాలి
గాయకులు : శ్రీ కృష్ణ , రమ్య బెహరా

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress