ఓ ఓ ఓ ఓ ఓ ఓ…
వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసారా
వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసారా
ఆలపించినా ఆలకించినా ఆనందమొలికించే గాథ
వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసారా…
శ్రీరాముని రారాజు సేయగా కోరెను దశరథ భుజాని
పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని
ఆ…ఆ…ఆ…
ఆ…ఆ…ఆ…
ఆ…ఆ…ఆ…
పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని
కారు చిచ్చుగా మారెను కైక మంథర మాట విని
మంథర మాట విని..
వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసారా..
అలుక తెలిసి ఏతెంచిన భూపతి నడిగెను వరముల ఆ తన్వి
జరుపవలయు పట్టాభిషేకము భరతునికి పృథివి…
మెలగవలయు పదునాలుగేడులు రాముడు కారడవి…
చెలియ మాటకు ఔను కాదని పలుకడు భూజాని…
కూలే భువి పైని..
వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసారా
కౌసలేయుడావించి మహీపతి ఆనతి తెలిపెను పినతల్లి
మోసమెరిగి సౌమిత్రి కటారి దూసెను రోసిల్లి…
దోషమని వెనుదీసె తమ్ముని రాముడు దయశాలి …
వనవాస దీక్షకు సెలవు కోరె పినతల్లి పదాల వ్రా..లి…
ఓ ఓ ఓ.. ఆ ఆ ఆ… ఓ ఓ ఓ..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..
వెడలినాడు రాఘవుడు అడవికేగగా…
పడతి సీత సౌమిత్రి తోడు నీడగా
ఆఆ…వెడలినాడు రాఘవుడు అడవికేగగా…
పడతి సీత సౌమిత్రి తోడు నీడగా…
గోడుగోడునా అయోధ్య ఘోల్లుమన్నది…
ఆఆఆ…
వీడకుమా మనలేనని వేడుకున్నది…
అడుగులబడి రాఘవా…ఆ…ఆ..ఆ..
అడుగులబడి రాఘవా.. ఆగమన్నది…
ఆగమన్నది..ఆగమన్నది…
అడలి అడలి కన్నీరై అరయుచున్నది…
సాహిత్యం : సముద్రాల సీనియర్
సంగీతం: ఘంటసాల
గాయకులు : పి.సుశీల , పి. లీల