పదే పదే ప్రాణం నిన్నే కోరగా
కలే నిజం కాదా నువ్వే చేరగా
ఒకే ఒక ఆశ నువ్వే చాలుగా
ప్రపంచమే లేదే ప్రతీ క్షణం నువ్వే నా కథ
అలా అలా దారి
నీ వైపుగా మారి
సరాసరి నిన్నే చేరనా…
మరీ మరీ నీతో ఉండాలని కోరి
మనస్సునే రాసి ఇవ్వనా…
కళ్ళు మూస్తూ ఉన్నా నిన్నే చూస్తున్నా
నీ కన్నుల్లో నన్నే వెతకనా…
దాచుకోలేనంత ప్రేమ నా పైన
నువ్వే కురిపించాలని కోరనా…
చేతిలోని గీత లాగ నిన్ను నేనే మార్చుకున్నా
గాలి కూడా తాకకుండా
నిన్ను నాలో దాచనా!!
చిరు చిరు చిరు నవ్వులు కురిసే
పెదవులు నీ పేరే పలికే!
ప్రతి అడుగిక నీ వెనకాలే
చిట్టి గుండె ఊరుకోదే!!
చిరు చిరు చిరు నవ్వులు కురిసే
పెదవులు నీ పేరే పలికే!
ప్రతి అడుగిక నీ వెనకాలే
కాదు అంటే ఊరుకోనే!!
మాటల్లో తెలిపేటి వీలుందా..
మౌనంలో మాటే వినిపిస్తోందా..
ఆనాటి స్నేహంలో తీపంతా
ఈనాటి ప్రేమల్లే మారిందా!
పదే పదే ప్రాణం నిన్నే కోరగా
కలే నిజం కాదా నువ్వే చేరగా
ఒకే ఒక ఆశ నువ్వే చాలు గా
ప్రపంచమే లేదే ప్రతీ క్షణం నువ్వే నా కథ
చిరు చిరు చిరు నవ్వులు కురిసే
పెదవులు నీ పేరే పలికే!
ప్రతి అడుగిక నీ వెనకాలే
చిట్టి గుండె ఊరుకోదే!!
చిరు చిరు చిరు నవ్వులు కురిసే
పెదవులు నీ పేరే పలికే!
ప్రతి అడుగిక నీ వెనకాలే
కాదు అంటే ఊరుకోనే!!
సంగీతం : అనుదీప్ దేవ్
సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ
గాయని : సింధూజా శ్రీనివాసన్
