ది ప్యార‌డైజ్‌లో ట్రాన్స్‌జెండ‌ర్‌గా నాని.. విల‌న్‌గా మోహ‌న్‌బాబు?!

నాచుర‌ల్ స్టార్ నాని డిఫ‌రెంట్ స్టోరీలు ఎంచుకోవ‌డంలో ముందుంటాడు. అందుకే ది ప్యార‌డైజ్ సినిమాలో ట్రాన్స్‌జెండ‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో మోహ‌న్‌బాబు క‌నిపించ‌నున్నార‌ట‌.

ది ప్యార‌డైజ్ సినిమా గ్లింప్స్ ఇప్ప‌టికీ ఇండ‌స్ట్రీలోనే కాదు.. ప్రేక్ష‌కుల్లోనూ చ‌ర్చ‌కు తెర తీసింది. ప‌క్కా యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న సినిమా మాస్‌కి ఫుల్ మీల్సేన‌ట‌. పైగా ఈ సినిమా రెండు పార్టులుగా కూడా రాబోతుంద‌న్న వార్త కూడా ఒక‌టి వినిపిస్తున్న‌ది. అయితే నాని ఈ గ్లింప్స్‌లో రెండు జ‌డ‌ల‌తో, ముక్కు పుడక‌తో క‌నిపించాడు. లుక్స్‌తోనే కాదు.. క్యారెక్ట‌ర్‌లోనూ డిఫ‌రెంట్ షేడ్ ఉంద‌ట‌. ది ప్యార‌డైజ్ సినిమాలో నాని ట్రాన్స్‌జెండ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌నే వార్త సోష‌ల్‌మీడియాని షేక్ చేస్తుంది. అంతేకాదు.. జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా, విల‌క్ష‌ణ న‌టుడు మోహ‌న్‌బాబు విల‌న్‌గా, సోనాలి కుల‌క‌ర్ణి త‌ల్లిగా క‌నిపించ‌బోతున్నార‌ట‌.

ఇక అనౌన్స్‌మెంట్ వీడియోతో సినిమా స్టోరీపై కొద్దో గొప్పో క్లారిటీ ఇచ్చాడు శ్రీ‌కాంత్ ఓదెల‌. పక్షి జాతిలో అందరు చులకనగా చూసేది కాకులునే. అలా కాకుల్లానే అణచివేతకు గురైన ఓ జాతి కథను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. ఇక్కడ అస‌లు ట్విస్ట్ ఏంటంటే.. ఈ జాతికి నాయకుడు ఒక వేశ్యకు పుట్టినవాడు. రెండు జుట్లతో అరివీర భయంకరమైన లుక్‌లో నాని మేకోవర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న‌ది.

ది ప్యార‌డైజ్ సినిమాకి సంగీతం అనిరుధ్ రవిచందర్, ఛాయాగ్రహణం జికె విష్ణు, ఎడిటింగ్ నవీన్ నూలి. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉత్కంఠభరితమైన సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. ది ప్యారడైజ్ మార్చి 26, 2025న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్‌తో సహా బహుళ భాషలలో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతున్న‌ది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress