నారీ నారీ న‌డుమ మురారి

దర్శనమే మధుర క్షణమే
నీవు నేను ఇక మనమే..
మనసున మోగే మంగళ నాద స్వరమే
నా దాక నిన్నూ నడిపింది ప్రేమే
నువ్వు ఇలా జతగా నడిచే ప్రతి అడుగు పూల వ‌న‌మే..

నీతో పరిచయమే పరిచయమే ప్రియవరం
ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు..
నీతో పరిచయమే పరిచయమే ప్రియవరం
ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు..

నీ పెదాలకు మెరుపైన ఎరుపు నేనే..
నీ పదాలకు సిరి సిరి మువ్వనైన నేనే..
నీ నీలి ముంగురుల ఉయ్యాలలుగానే
నీ వేలి ఉంగరమై వెయ్యేళ్లు నావేనే..
నీ చూపు నేనే.. నీ రేపు నేనే..
నీ యదలో క‌దిలే మెదిలే ఆశ ఒడైన నేనే ..

నీతో పరిచయమే పరిచయమే ప్రియవరం
ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు..

రాసి ఇవ్వన నా నవ్వులన్నీ నీకే
స్వీకరించనా నీ ప్రతి కంటి చమ్మ నాకే
నా జంట నువ్వుంటే వెన్నెల మధుమాసం
నీ తోడు లేకుంటే వేసంగి వనవాసం..
ఆ రామ సీత నా ప్రేమ గీత
నువ్వు ఇలా జతగా నిలిచి నా క‌ల‌లు పండేనంట‌..

దర్శనమే మధుర క్షణమే
నీవు నేను ఇక మనమే
మనసున మోగే మంగళ నాద స్వరమే
నా దాక నిన్నూ నడిపింది ప్రేమే
నువ్వు ఇలా జతగా నడిచే ప్రతి అడుగు పూల వ‌న‌మే..

నీతో పరిచయమే పరిచయమే ప్రియవరం
ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు
నీతో పరిచయమే పరిచయమే ప్రియవరం
ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు

సాహిత్యం : స‌ర‌స్వ‌తీ పుత్ర రామజోగయ్య శాస్త్రి
సంగీతం : విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌
గానం : యాజిన్ నిజార్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress