విన్నాలే.. వింటున్నాలే
మనసున నీ మాట
అన్నాలే.. అంటున్నాలే
బదులుగా నా మాట
అలా అలా వెళ్లిపోతూ
మళ్లీ మళ్లీ మళ్లీ నిన్ను చూసా
మిలా మిలా రెప్పచాటు
మౌనరాగాలన్నీ చదివేసా
ఏదో మాయ చేసెనే ఇలా ఈ క్షణం
నువ్వు నేను ప్రేమకు చెరో అక్షరం
చెలి కలువై విరబూసా
నీ తలపుల వెన్నెలలో
తొలివలపై తెరతీసా
నీ కిలకిల వేకువలో..
మొదలే మొదలే మొదలే
మన కథ మొదలే
మనకూ మనకూ ఇకపై
రంగుల కలలే
మొదలే మొదలే మొదలే
మన కథ మొదలే
మనకూ మనకూ ఇకపై
రంగుల కలలే
ఇందుకేమో మనసు.. ఇన్నినాళ్లు వేచే
ప్రాణవాయువై తగిలేలా నీ గాలి వీచే
అందమైన సొగసు.. అంబరాలు దించే
అందుకోగా రా రమ్మంటూ గుండె సడులు పెంచే
ఒక సెకను ముందుగా వేరుగా
ఇప్పుడేమో ఒకరిలో ఒకరుగా
ఒక నువ్వు నేను తనవారుగా
ముడిపడెను ప్రేమ మన తీరుగా
గగనాలు భువనాలు
కలగలిసిన రేఖ ఇదే
గ్రహణాలు తొలగించే
కిరణాల రాక ఇదే
మొదలే మొదలే మొదలే
మన కథ మొదలే
మనకూ మనకూ ఇకపై
రంగుల కలలే
మొదలే మొదలే మొదలే
మన కథ మొదలే
మనకూ మనకూ ఇకపై
రంగుల కలలే
సంగీతం : రాధన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గాయకులు: మధుశ్రీ, నరేష్ అయ్యర్
