అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..
అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..
నమ్మేవాడిని అమ్మేయడం….
మొక్కేవాడిని తొక్కేయడం..
దొరికేవాడిని దోచేయడం..
తల వంచేవాడిని ముంచేయడం..
యుగాల నుండీ..
జరుగుతున్న కథ..
యుగాంతమైనా మారిపోని కథ..
అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..
వంతెన కట్టేదొకడు..
దాన్ని దాటే వాడింకొకడు..
నిచ్చెన వేసేదొకడు…
పైపైకెక్కే వాడింకొకడు..
ముందుకు తీసుకు వెళ్ళేవాడిని అక్కడితోనే ఆపడం..
ఎత్తుకు మోసుకు వెళ్ళేవాడిని లోతులలోనే ఉంచడం..
పేదల నెత్తుటి మరకలు అంటని పెద్దల సిరి ఉందా..
బీదల కన్నుల నీటిని తుడవని కథలకు అర్ధం ఉందా..
అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..
అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..
లేని వాడికి నోటి ఆకలి..
ఉన్నవాడికి నోట్ల ఆకలి..
నోటికి తెలుసును వద్దు వద్దు..
నోట్లకు తెలియదు హద్దు పద్దు..
బలహీనుడికి ఆశే ఉంటది..
బలవంతుడికి అత్యాశుంటది..
ఓ.. ఆశకు బ్రతుకే సరిపోద్ది..
ఒక బ్రతుకే సరిపోద్ది..
అత్యాశే అందరి బ్రతుకులతో ఆట ఆడుకుంటది..
అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..
అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
గాయకులు: హైడీ కార్తీ, కరీముల్లా