ఖేల్ ఖ‌త‌మ్ ద‌ర్వాజా బంద్‌

ఏదో ఏదో ఏదో జరిగెనే ఎద లోపలా
ఏవో ఏవో కలలు విరిసెనే
నిన్నా మొన్నా లేనే లేదిలా అరె ఏంటిలా
ఉన్నట్టుండి ముంచేసావిలా..

మనసే ముసుగును తీసే
అడుగులు వేసే బయటకి నీతోనే
కలిసే నిమిషము వణికే పెదవులు పలికే తకధిమి తందానే..

ఏదో ఏదో ఏదో జరిగెనే ఎద లోపలా
నీలో నాలో ఏదో జ‌రిగెనే
నిన్నా మొన్నా లేనే లేదిలా అరె ఏంటిలా
ఉన్నట్టుండి ముంచేసావిలా

నింగీ నేలా నీలా నాలా
కలిసాయేమో అన్నట్టు ఉందే
ఆగీ మోగే గుడిలో గంటా
ఎద చప్పుడునే లెక్కిస్తూ ఉందే..

మేఘాల పోలికా నా గుండెకంటెనేమో
మరి నిన్ను చూడగా మెరిసే
ఓ చల్లగాలిలా నీ చూపు తాకేనంటే
అది వాన చినుకులా కురిసే..

ఏదో ఏదో ఏదో జరిగెనే ఎద లోపలా
నీలో నాలో ఏదో జ‌రిగినే
నిన్నా మొన్నా లేనే లేదిలా అరె ఏంటిలా
ఉన్నట్టుండి ముంచేసావిలా

నేనా కాదా.. నీతో నేనా
ఇది నిజమా నే భ్రమలో ఉన్నానా
సీతాకోకా నేనైపోయా
నీ రంగుల్లో నే పడిపోయాకా

నీ ఊసు దాటని అలవాటు పోదు అసలు
నీ కలను మోయగా కనులూ
నా వేలితో అలా స‌వ‌రించుకుంటూ కురులు
వేవేల న‌వ్వులే మొద‌లు..

ఏదో ఏదో ఏదో జరిగెనే ఎద లోపలా
ఏవో ఏవో కలలు విరిసెనే
నిన్నా మొన్నా లేనే లేదిలా అరె ఏంటిలా
ఉన్నట్టుండి ముంచేసావిలా

సాహిత్యం: పూర్ణా చారి
సంగీతం: సురేష్ బొబ్బిలి
గాయకులు:
కార్తీక్ , హరిణి ఇవటూరి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress