సగమై చెరి సగమై ఇక నువ్వు నేను
ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను
ఇరు పెదవుల శబ్దం
విరి ముద్దుల యుద్ధం
మెలి తిప్పిన మీసం
నా నడుమంచున మడతెంచితె
ప్రాణం ఉన్నన్నాళ్లూ
జతపడి నీకే కౌగిలి పంచాలని
కాలం ఉన్నన్నాళ్లూ కరగని కథల
నీతో బ్రతకాలని
సగమై చెరి సగమై ఇక నువ్వు నేను
ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను
నీతో ఉంటే కలికాలమే చంపుతోంది
చలి కాలమై
వెచ్చనైన చలిమంటే నీ ఊపిరి అంట
జారేటి జలపాత వీధిలో
జంట స్నానాలు చేద్దామా
స్వర్గాల దుర్గాల కోటలే
మరి పరిపాలిద్దామా
మరు జన్మలలో కాలాన్నే దోచేసేనా
ఈ జన్మే అందించనా
తలలేని విరహాలతో
ఊపిరాగిపోదా మరి
రెప్ప పాటు సమయం నువ్వే నన్నే వీడవో
రంగుల మల్లెలు జల్లేనే
హరివిల్లు మనకోసం
వెన్నెల పందిరి అల్లెనే
రాతిరి వేళల ఆకాశం
కల కనగడం ఆలస్యం నిజమైపోతుందే
ఈ భాగ్యం మనదేనా
సగమై చెరి సగమై ఇక నువ్వు నేను
ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను
ఇరు పెదవుల శబ్దం
విరి ముద్దుల యుద్దం
మెలి తిప్పిన మీసం
నా నడుమంచున మడతెంచితే
ప్రాణం ఉన్నన్నాళ్లు జతపడి నీకే
కౌగిలి పంచాలని
కాలం ఉన్నన్నాళ్లు కరగని కథల
నీతో బ్రతకాలని
సాహిత్యం: శ్రీమణి
సంగీతం : స్టీఫెన్
గాయకులు: ఎల్.వి.రేవంత్ , సాహితి చాగంటి