తిరిగే భూమి..
ఉన్న చోటే ఉంటుందా
వీచే గాలి..
నిమిషం అయినా నిలిచేనా..
ఒంటరివై నువ్వే..
మిగిలిపోకురా పదరా..
స్నేహం నీ తోడై.. అడుగేస్తూ ఉంటే సాగిపో..
ఓ..ఓ..
ఓ.. నింగి నేల గాలి దారి
నీదే…
హద్దే లేని స్వేచ్ఛలో ఎగిరి..
చుట్టేయ్ ధరణి..
నాతో తోడై రారా మేఘాల అంచుకే
ఆఖరి నిమిషం నిన్నే చేరేముందే
ఈ యవ్వనమే నీతో నడిచేటి ఇంధనం
అడుగే ఆపక నీ గమ్యమే చేరు..
ఓ.. ఓ.. ఓ
మీతో నడిచే..
ప్రతి అడుగు అనుభవం
నాకై మిగిలే ఓ తీపి జ్ఞాపకం
గడిదాటే గడియారమైనదే బ్రతుకే..
ఓ..
గడిచేటి గంటలైనవే నిమిషం..
లోకం నీ కోసం..ఓ..
వేచి చూసేరా పదరా.. ఓ..
సాగే ఈ దారి..ఓ..
గుండెల్లో మిగిలే గురుతై..
ఓ దూకే నీరే చెలిమితో నన్నే తడిపే..
ఓ..ఓ..
తాకే అలగా గతముకే నన్నే తోసే..
నాతో తోడై రారా శిఖరాల ఎత్తుకే
ఆఖరి నిమిషం నిన్నే చేరేముందే
దారే దూరం అంటూ ఏ చినుకు ఆగదే
మబ్బే దాటేసి ముద్దడదా భూమి..
ఓ.. ఓ.. ఓ..
సంగీతం : కమ్రాన్
సాహిత్యం : హరీష్ రెడ్డి ఉప్పుల
గాయకులు: ఏకనాథ్, జునైద్, సుధాంష్
