ఏ ఉప్పెనలు చూడకర్ల
తన ఉత్సహం చూస్తే చాలదా..
ఏ అద్భుతము చూడకర్ల
తన పోరాటం చూస్తే చాలదా..
ఏ పధకం బెడిసి కొట్టినా
తను వేసే లెక్క తప్పినా
మళ్లీ సరికొత్త వ్యూహమై అడుగేస్తాడుగా…
ఏ తప్పులు ఎన్ని చేసినా
తన వాళ్ళే వెక్కిరించినా
ఏ వైట్నర్ చెరపలేని
ఓ పేరే గా…
పాబ్లో నెరుడా…
పాబ్లో నెరుడా…
పాబ్లో నెరుడా…
ఏ ఉలికి లొంగని రాయి ఇతడా
పాబ్లో నెరుడా…
పాబ్లో నెరుడా…
పాబ్లో నెరుడా…
ఏ ఊహకి అందని నిజమితాడా
తను అడుగులు వేసే ప్రతి గతుకుల దారి
తన దూకుడు చూసి పక్కాకు జరిగి చోటివ్వదా
పెను అలజడి రేపే నది అలలను వంచి
ఎదురీదుతూ వెళ్లి తన లక్ష్యాన్నే ఛేదించెయ్ డా
జేబులు కొట్టే వాళ్ళకి జై కొడతాడోయ్ ఆ తెలివికి
బైకులు దోచే బ్యాచుకి శిష్యుడు ఈ చలాకి..
బూకిష్ నాలెడ్జ్ బరువుని
తన రబ్బిష్ పనులే గురువని
తప్పుల నుంచే కొత్తవి కనిపెట్టేస్తుంటాడు..
పాబ్లో నెరుడా…
పాబ్లో నెరుడా…
పాబ్లో నెరుడా…
ఏ ఉలికి లొంగని రాయి ఇతడా
పాబ్లో నెరుడా…
పాబ్లో నెరుడా…
పాబ్లో నెరుడా…
ఏ ఊహకి అందని నిజమితాడా
సంగీతం : అచ్చు రాజమణి
సాహిత్యం : వనమాలి
గాయకుడు : బెన్ని దయాల్