టేస్టీ.. స్వీట్‌పొటాటో ఫ్రిట్ట‌ర్స్ ఈ కాలంలో మ‌రింత ఆక‌లిని పెంచేస్తాయి!

కావాల్సిన ప‌దార్థాలు :

చిల‌గ‌డ‌దుంప : ఒక కేజీ
మైదా : 3/4 క‌ప్పు
సోయాసాస్ : అర టేబుల్‌స్పూన్
దాల్చిన‌చెక్క పొడి : పావు టీస్పూన్
ఆలివ్ ఆయిల్ : పావు క‌ప్పు
ఉప్పు : పావు టీస్పూన్
బ‌ట‌ర్ : త‌గినంత‌

తయారీ విధానం :
స్టెప్ 1 :
చిల‌గ‌డదుంప పైన చెక్కు తీసి గుండ్రంగా క‌ట్ చేయాలి. వీటిని ఒక గిన్నెలో నీళ్లు పోసి పెట్టాలి.
స్టెప్ 2 : వీటిని పెద్ద మంట మీద 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నీళ్లు మొత్తం వంచేసి చ‌ల్ల‌గా అవ్వనివ్వాలి.
స్టెప్ 3 : ఒక గిన్నెలో ఈ చిల‌గ‌డ‌దుంప‌ల‌ను మెత్త‌గా చేసి అందులో మైదా, సోయాసాస్‌, దాల్చిన పొడి, ఉప్పు వేసి క‌లుపాలి.
స్టెప్ 4 : వీటిని ప్యాటీస్‌లాగా చేసి ఒత్తి పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న ప్యాన్ పెట్టి కొద్దిగా బ‌ట‌ర్‌, ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేయాలి.
స్టెప్ 5 : ఈ ప్యాటీస్‌ని రెండు వైపులా గోల్డెన్ క‌ల‌ర్ వ‌చ్చేవ‌ర‌కు వేయించాలి. వీటిని ఇలా.. 400డిగ్రీ ఫార‌న్‌హీట్ వ‌ద్ద ఓవెన్‌లో కూడా బేక్ చేసుకోవ‌చ్చు. వీటిని మ‌య‌నీస్‌తో తింటే మ‌రింత టేస్టీగా ఉంటాయి.

1 thought on “టేస్టీ.. స్వీట్‌పొటాటో ఫ్రిట్ట‌ర్స్ ఈ కాలంలో మ‌రింత ఆక‌లిని పెంచేస్తాయి!”

Leave a Reply to Kamala Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress