కావాల్సిన పదార్థాలు :
మైదా: ఒక కప్పు
శనగ పిండి: పావు కప్పు
బేకింగ్ సోడా: ఒక టీస్పూన్
పాలు: పావు కప్పు
చక్కెర : ఒక కప్పు
యాలకులు: 2
నూనె: పావు కప్పు
బాదం: పావు కప్పు
నెయ్యి: ఒక టీస్పూన్
తయారీ విధానం:
స్టెప్ 1:ముందుగా ఒక మిక్సీ జార్ లోకి చక్కెర, యాలకులు, నూనె వేసి మిక్సీ పట్టుకోవాలి. బాదం చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి.
స్టెప్ 2: ఒక గిన్నెలోకి మిక్సీ పట్టుకున్న చక్కెర మిశ్రమం వేసుకొని మైదా, శనగ పిండి, బేకింగ్ సోడా వేసి అన్ని కలిసేలా ఒకసారి కలిపిన తర్వాత పాలు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
స్టెప్ 3: స్టౌపై ఒక వెడల్పాటి గిన్నెపెట్టుకొని ఐదు నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి. ఈ లోపు కలిపి పెట్టుకున్న మిశ్రమంను చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కొంచెం మందంగా బిస్కెట్ షెప్ వచ్చేలా ప్రెస్ చేసి పైన కట్ చేసుకున్న బాదం వేసి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 4: ఒక ప్లేట్‌కి నెయ్యి రాసి ముందుగా చేసి పెట్టుకున్న బిస్కెట్స్‌ని ప్లేట్లో సెట్ చేసుకొని ప్రి హీట్ చేసుకున్న గిన్నెలో స్టాండ్ పెట్టుకొని దానిపై బిస్కెట్స్ సెట్ చేసుకున్న ప్లేట్ పెట్లాలి.
స్టెప్ 5 : సన్నని మంటపై పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఇలా చేస్తే పిల్లలు ఒక్క బిస్కెట్ కూడా మిగల్చకుండా తినేస్తారు.
My favorite childhood snack … thanks for posting the recipe