కోర కోర మీసాలతో..
కొదమ కొదమ అడుగులతో
కొంటె కొంటె చెణుకులతో..
కొలిమిలాంటి మగటిమితో..
సరసర వచ్చినాడు.. చిచ్చర పిడుగంటివాడు..
ఏదో ఏదో తలచినాడు, ఎవరినో వెతికినాడు..
ఎవరంట.. ఎవరంట.. ఎవరంట..
ఎవరంట.. ఎవరంట.. ఎవరెవరెవరెంట..
కొండపల్లి ఎండి బొమ్మ
కోల కళ్లతో చూసిందమ్మ..
తీయతీయని తేనెలకొమ్మ..
తీయని తెరలే తీసిందమ్మ..
వజ్రలా జిలుగులున్న.. రతనాల ఎలుగులన్నా..
కెంపుల ఒంపులున్న.. మోహరిలా మెరుపులున్నా..
నా పైడి గుండెలోన ఏడి పుట్టించి..
మరిగించి మరిగించి.. కరిగించి కరిగించి..
కొల్లగొట్టినాదిరో కొల్లగొట్టిందిరో..
కొల్లగొట్టి నా గుండెనే ముల్లెగట్టినాదిరో..
కొల్లగొట్టినాదిరో కొల్లగొట్టినాదిరో..
కొల్లగొట్టి నా గుండెనే ముల్లెగట్టినాదిరో..

అయ్యయ్యో అయ్యయ్యో ఆ చిన్నది.. ఇంకేమీ చేసిందయ్యో..
అయ్యయ్యో అయ్యయ్యో ఆ కుర్రది ఏ మంత్రం వేసిందయ్యో..
కన్నులలోని కాటుక మేఘం..
సీకటి నాపై సిలికిందే..
మాటలతోనే మెలికేసిందే..
మర్మం ఏదో దాసిందే..
ఆడవాళ్ల మనసు అడవిలాంటిదని..
ఎరగని సంటోడివా.. అంత అమాయకుడివా..
పడుసుపిల్ల తీరు పట్టుసిక్కిందని పసిగట్టలేనోడివా..
వట్టి శొంఠికొమ్మవా.. లేత ఎన్నపూసవా..
అరే మీసల రోషాలా మోనగాన్ని పట్టేసి..
పసివాన్ని చేసేసి పసరేదో పూసేసి..
కొల్లగొట్టినాదిరో కొల్లగొట్టిందిరో..
కొల్లగొట్టి నా గుండెనే ముల్లెగట్టినాదిరో..
కొల్లగొట్టినాదిరో కొల్లగొట్టినాదిరో..
కొల్లగొట్టి నా గుండెనే ముల్లెగట్టినాదిరో..
ఊపిరిలోని ఆవిరి పవనాలే..
విరివిగా లేఖలే విసిరేనే..
ఉప్పెనలాగా పొంగే పౌరుషమే..
సొగసుకు సంకెల వేసెనే..
చీకు చింత లేని వాడి చిత్తం దోచావే..
పారాహుషార్ పోరగాడిని పాగల్ చేసేవే..
దారేదైనా.. దవ్వేదైనా.. నీదై ఉంటానే..
పేరేదైనా.. తీరేదైనా పెనిమిటి అంటేనే అడ్డెడ్డెడే..
కొల్లగొట్టినాదిరో కొల్లగొట్టినాదిరో..
కొల్లగొట్టి నా గుండెనే ముల్లెగట్టినాదిరో..
కొల్లగొట్టినాదిరో కొల్లగొట్టినాదిరో..
కొల్లగొట్టి నా గుండెనే ముల్లెగట్టినాదిరో..
రచయితః చంద్రబోస్
పాడినవారుః మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల
మ్యూజిక్ డైరెక్టర్ః యం.యం.కీరవాణి