హరి హ‌ర వీర‌మ‌ల్లు

వజ్రదేహాయ
రౌద్ర రాధేయ
భ‌ద్రు రూపాయ
భద్రకాలీయ
దక్ష దీక్షాయ
ఉగ్ర వ్యాగ్రాయ
త్రిపురనాశకాయ
క్షిప్ర దగ్ధాయ…
హేహేహే….

ప్రళయకాల రుద్రుడల్లే
తాండవించు భైరవం
గగనమైనా భువనమైనా
ద‌ద్ద‌రిల్లు రౌరవం
నిశినీ చీల్చు క్షిధ్రుడల్లే
ఉద్భవించు ఆయుధం
రక్షకైనా శిక్షకైనా
చొచ్చుకెల్లు రణధ్వనం

ధిమిత ధిమిత ధిమిత యోధ
ధిమిత ధిమిత ధిమిత క్రోధ
ధిమిత ధిమిత ధిమిత శోధ
ధిమి ధిమి ధిమి ధిమి ధిమి ధిమి

సమర శంఖారావమల్లే
ఘీంక‌రించు ఆగ్రహం
వైరమైన శౌర్యమైనా
మ్రోగు మరణ మృదంగం
జూలు దుళుపు సింహమల్లే
హుంకరించు పౌరుషం
వ్యూహమైన యుద్ధమైన
ఎగురు విజయ పతాకం

ధిమిత ధిమిత ధిమిత మహిత
ధిమిత ధిమిత ధిమిత అవిత
ధిమిత ధిమిత ధిమిత అజిత
ధిమి ధిమి ధిమి ధిమి ధిమి ధిమి

ఘోర క్రూర మృగముమల్లే
వెంబడించు ఆక్రోశం
శత్రువైనా మృత్యూవైనా
మోకరిల్లు ప్రతాపం
వీర ధీర శూరుడల్లే
విజ్రుంబించు మహోగ్రం
మంద‌నైనా మందినైనా
కుమ్ముకెల్లు మహోక్షం

రారా అసురులే ముసురుకోగా
రారా బుసలానే విసిరివే రా
రారా అహితులే కసురుకోగా
రారా శిరస్సులే తురిమివేరా

ధిమిత ధిమిత ధిమిత ఘాత
ధిమిత ధిమిత ధిమిత ఖ్యాత
ధిమిత ధిమిత ధిమిత దాత
ధిమి ధిమి ధిమి ధిమి ధిమి ధిమి

నివురునొడిలే నిప్పురవ్వర
కధము తొక్కే ఖడ్గధారిరా
బరిలో దూకే కర్కశుందురా
దిక్కులన్ని బిక్కటిల్లురా
పొగరు విడని మద‌గజం
బేదిరి అదిరే ముజ్జగం
పదునుగున్న అంకుశం
గురిని గెలుచు అంబకం
భారతమాత నుదుటిరాత
మార్చు ధీమసం

సంగీతం : ఎం.ఎం. కీర‌వాణి
సాహిత్యం : రాంబాబు గోసాల‌
గాయకులు: ఐరా ఉడిపి, కాల భైరవ, సాయి చరణ్ భాస్కరుణి, లోకేశ్వర్ ఈదర, హైమత్ మహమ్మద్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress