ఓ..ఓ.. ఓ… ఓ.. ఓ..
హో.. ఓ..ఓ.. ఓ… ఓ.. ఓ..
రామ రామ రామ అంటూ రాగమందుకో
రామ గాథ సారం తెలిసేలా..
కృష్ణ కృష్ణ కృష్ణ అంటూ కీర్తనందుకో..
గీతలోని భావం తెలిసేలా..
రామ రామ రామ అంటూ రాగమందుకో
రామ గాథ సారం తెలిసేలా..
కృష్ణ కృష్ణ కృష్ణ అంటూ కీర్తనందుకో..
గీతలోని భావం తెలిసేలా..
మనలోనే దైవం దాగుంది
నడిపించే దీపం తానంది
మన దారే మారి పోతుంటే
దరి చెర్చే గురువే తానైంది
గురువంటే అమ్మేలే భూమి పైన బ్రహ్మేలే..
తను తోడుగా ఉంటే రోజు కొత్త జన్మేలే..
గురువంటే అమ్మేలే భూమి పైన బ్రహ్మేలే..
తను తోడుగా ఉంటే రోజు కొత్త జన్మేలే..
హో.. హో.. హో..
ప్రాయమొచ్చి పాగా వేసి పడుచు కోటలో..
మంచి చెడ్డలెంచి చూడాలి..
దూసుకుంటూ ఎన్నో ఎన్నో ఆశాలోచ్చినా..
ఆగమంటూ అదుపే చేయాలి..
పగ్గమేసి ఆపేస్తుంటే ప్రాయమాగునా..
మనసులోని ఆశే మారేనా..
మారుతున్న కాలంతోనే మారకుండగా..
నిన్న లాగే నేడు ఉండాలా..
పరుగపేయాలి అంటానా..
ఎటువైపే చూడు కొంతైనా..
కాలకానే కాదు జీవితమే..
వలలన్ని దాటి సాగటమే..
గ్రహణాలు ఉన్నవిగా
సాగే సూర్య చంద్రులకే..
అవి దాటి వచ్చాక..
అన్ని కాంతి చంద్రికలే..
గ్రహణాలు ఉన్నవిగా
సాగే సూర్య చంద్రులకే..
అవి దాటి వచ్చాక..
అన్ని కాంతి చంద్రికలే..
హో..హో..హో..
రామ రామ రామ అంటూ రాగమందుకో
రామ గాథ సారం తెలిసేలా..
కృష్ణ కృష్ణ కృష్ణ అంటూ కీర్తనందుకో..
గీతలోని భావం తెలిసేలా..
రామ రామ రామ అంటూ రాగమందుకో
రామ గాథ సారం తెలిసేలా..
కృష్ణ కృష్ణ కృష్ణ అంటూ కీర్తనందుకో..
గీతలోని భావం తెలిసేలా..
సంగీతం : కాల భైరవ
సాహిత్యం : చైతన్య ప్రసాద్
గాయకులు : వాస పావని, ఆదిత్య అయ్యంగార్, హర్య బి.వి, రిషిల్