దూర‌ద‌ర్శ‌ని – క‌లిపింది ఇద్ద‌రినీ

నా నీడ వెళుతుందా
నా తోడు వీడిందా
ఇకపైన రాలేను అంటూ..

నా గతమే కాలిందా
నా జతయే లేనందా
ఇక‌పైన‌ ఒంట‌రి నువ్వంటూ..

ఈ గాయమే నన్ను గుండెల్లో గుచ్చే
ఈ దూరమే నన్ను వేధిస్తుంటే
అలలేని సంద్రాన్ని చుపిస్తావా
క‌ల‌లేని న‌య‌నాన్ని ఊహిస్తావా..

నా నీడ వెళుతుందా..
నా తోడు వీడిందా..
ఇకపైన రాలేను అంటూ..

నా గతమే కాలిందా
నా జతయే లేనందా
ఇక‌పైన‌ ఒంట‌రి నువ్వంటూ..

కోరుకున్న నా ప్రాణమే నీ హృదయాన్నెతికే
నువ్వు లేక నా ప్రాణం విలవిలలాడే..
జారుతున్న కన్నీరే నీ వివరాలడిగే
నిన్ను చూడక నా చూపే నలిగే..

నువ్వు లేని నిమిషాన్ని నెట్టేస్తున్నా
నువ్వుంటే ఒక్క క్షణం చాలంటున్నా
నువ్వు లేని నా నిన్నని చూపిస్తావా
నేను లేని రేపటిని ఊహిస్తావా..

నా హృద‌యం అడిగింది త‌న చ‌ప్పుడు ఏది అని
నిన్ను వీడిన మ‌రు నిమిషాన‌..
నా ప‌రుగే ఆగింది రేప‌న్న‌ది లేదు అని..
నీ జ‌త‌గా లేని ప‌య‌నానా..

ఈ గాయ‌మే న‌న్ను గుండెల్లో గుచ్చి
ఈ దూర‌మే న‌న్ను వేధిస్తుంటే..
నే లేని నాలోన నిన్నుంచాను..
నువ్వు లేని రేప‌టిని ఊహించ‌లేను..

నా హృద‌యం అడిగింది త‌న చ‌ప్పుడు ఏది అని
నిన్ను వీడిన మ‌రు నిమిషాన‌..
నా ప‌రుగే ఆగింది రేప‌న్న‌ది లేదు అని..
నీ జ‌త‌గా లేని ప‌య‌నానా..

సాహిత్యం : నారాయ‌ణ ఆవుల
సంగీతం : ఆనంద్ గుర్రానా
గాయ‌కులు : అనురాగ్ కుల‌క‌ర్ణి, సునీత‌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress