హే జింగిలి.. హే జింగిలి..
నా జిందగీ నిండుగా జల్లావు రంగులే
హే జింగిలి.. హే జింగిలి..
నా సింగిలు లైఫ్‌నే తిప్పావు
లబ్ డబ్ లబ్ డబ్ హర్ట్-బీట్ ఆగిపోయే
లవ్ లవ్ లవ్ లవ్ పాటలాగా మారిపోయే
లబ్ డబ్ లబ్ డబ్ హర్ట్-బీట్ ఆగిపోయే
లవ్ లవ్ లవ్ లవ్ పాటలాగా మారిపోయే
మొదలైంది లోపలేదో యుద్ధమే
ఓడిపోత నేను నీకోసమే
మరింతగా మరింతగా మరింత దగ్గరవ్వవే
నీ గుండేదో నా గుండెదో ఈ
చప్పుడెవరిదంటే తెలియకుండదే..
ఏం నవుతున్నవే కళ్ళతోటి పొడిచి పొడిచి
నా ప్రాణమే నువ్వు వెళ్ళిపోకే విడిచి విడిచి
ఏం నవ్వుతున్నవే కళ్ళతోటి పొడిచి పొడిచి
నా ప్రాణమే నువ్వు వెళ్ళిపోకే విడిచి విడిచి
మైకుసెట్లో ఓల్డ్ సాంగ్లా
లాగినావె నా రాకుమారి మారి
నిప్పు పెట్టిన తేనె పట్టులా
రేపినావె ఆశలొక్కసారి
నచ్చావులే మచ్చలేని జాబిలమ్మ
నీ వల్లనే ఎత్తాను చూడు కొత్త జన్మ
మెల్లగా మాయమైంది కంటిచెమ్మ
ఎందుకే నేను అంటే ఇంత ప్రేమ
ప్రతీ క్షణం ఈ హాయిలో
ఇలా ఇలా ఉంటాను తడిచి తడిచి
తడిచి తడిచి
నీ వెంట వస్తనే నిదురలోను నడిచి నడిచి
దూరాన్ని పెంచొద్దె జ్ఞాపకాలు తుడిచి తుడిచి
నీ వెంట వస్తనె నిదురలోను నడిచి నడిచి
దూరాన్ని పెంచొద్దె జ్ఞాపకాలు తుడిచి తుడిచి
రచయితః భాస్కర భట్ల
పాడినవారుః సామ్ సీఎస్
మ్యూజిక్ డైరెక్టర్ః సామ్ సీఎస్