క్రికెట్ క్రీజులోనే కాదు.. ఇన్‌స్టా రీల్స్‌ల్లోనూ అంత క్రేజ్ సంపాదించుకున్నాడు డేవిడ్ వార్నర్. ఈ క్రికెట్ ప్లేయర్ హాలీవుడ్, బాలీవుడ్‌లతో సినీరంగ ప్రవేశం చేస్తాడునుకున్నారందరూ. కానీ ఒక తెలుగు సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి అందరికీ తెలుసు. బ్యాట్ పట్టాడంటే వీర బాదుడు బాదుతాడు. అటు ఐపీఎల్‌లోనూ ఎస్ఆర్‌హెచ్‌తో తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు. కోవిడ్ సమయంలో సోషల్ మీడియాలో తెలుగు పాటలకు డ్యాన్సులు వేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. వార్నర్‌లో యాక్టింగ్ కోణం చూసి కచ్చితంగా సినిమాల్లో కనిపిస్తాడని ఆశించారు.
రాజమౌళి, డేవిడ్ వార్నర్ కలిసి ఒక యాడ్‌లో కనిపించారు. అందులో డేవిడ్ వార్నర్ నటుడిగా, రాజమౌళి డైరెక్షన్‌లో కనిపించాడు. అయితే అది కేవలం యాడ్ మాత్రమే. ఇప్పుడు వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్ నటించిన రాబిన్‌హుడ్ సినిమాలో వార్నర్ ఒక చిన్న పాత్రలో కనిపించనున్నాడనే వార్త చాలా వైరల్ అవుతున్నది. ఈ సినిమా స్క్రిప్ట్ దశలోనే దర్శకుడు వార్నర్‌ని దృష్టిలో పెట్టుకొని ఆ క్యారెక్టర్‌ని రాసుకున్నాడు.
వార్నర్‌కి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ వెంకీ కుడుముల చెప్పిన పాత్ర నచ్చడంతో ఈ సినిమాతో ఆయన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కావాలనుకున్నారు. ఇందులో అతిథి పాత్ర ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. మార్చి 28న రాబోతున్న రాబిన్‌హుడ్ సినిమాలో నితిన్, శ్రీలల ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.