మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు

హే మీసాల పిల్ల..
నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల..
మీసాల పిల్ల..
నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల..
పొద్దున‌ లేచిన‌ దగ్గర నుంచి డైలీ యుద్ధాల..
మొగుడు పెళ్లాలంటేనే కంకి కొడవళ్ళ..

అట్టా కన్నెర్ర జెయ్యలా కారాలే నూరేలా…
ఇట్టా దుమ్మెత్తి పొయ్యలా దూరాలే పెంచేలా
కుందేలుకు కోపం వస్తే చిరుతకి చెమటలు పట్టేలా..

నీ వేషాలు చాల్లే..
నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే..
అందితే జుట్టు అందకపోతే కాళ్ళ బేరాల..
నువ్విట్టా ఇన్నోసెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా..

ఓ బాబు నువ్వే ఇంతేనా..
మగజాతి మొత్తం ఇంతేనా..
గుండెల్లో ముల్లు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా..

మీసాల పిల్ల..
నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల..
వేషాలు చాల్లే..
నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే..
మీసాల పిల్ల….

ఆ ఎదురింటి ఎంకట్రావ్ కుళ్లుకు సచ్చుంటాడు
పక్కింటి సుబ్బారావ్ దిష్టేట్టుంటాడు
ఈడు మట్టే కొట్టుకు పోను
వాడు యేట్లో కొట్టుకు పోను…

ఆ ఏడు కొండల వెంకన్నా నా బాధని చూసుంటాడు
శ్రీశైలం మల్లన్నా కరుణించుంటాడు
కనుకే నీతో కట్ అయ్యాను
చాలా హ్యాపీ గుంటున్నాను..

నువ్వింత హార్ష్ గా మాటడాలా
హార్ట్ హాట్ అయిపోయేలా…
ఏ తప్పు చేయకుండా భూమ్మీద ఎవ్వరైనా ఉంటారా..

నీ తప్పులు ఒకటా రెండా చిత్రగుప్తుడి చిట్టాలా

హే మీసాల పిల్ల..
నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల..
నీ వేషాలు చాల్లే..
నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే..

రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లలా
నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్లీ దూకాల
అబ్బా పాతవన్ని తొడాల
నా అంతు ఏదో చూడాలా
కలకత్తా కాళీమాత నీకు మేనత్త అయ్యేలా

హే మీసాల పిల్ల..
నా మొహం మీద ఎన్నిసార్లు డోరె వెయ్యలా..
హల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా..

సంగీతం : భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం : భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్‌
గాయ‌కులు : ఉదిత్ నారాయ‌ణ్‌, శ్వేత మోహ‌న్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress