కిష్కింధ‌పురి

కనులకు తొలి వెలుగేవరని అంటే
బదులుగా నిలిచెనూ అమ్మేగా

తరగని ప్రేమకు రుజువేవరంటే
ఎద లయ చదివిన అమ్మేగా

ఎదిగీ ఎదగని నా ప్రపంచం నీతో నిండెను పూర్తిగా
ఎవరికి తెలియని నా సమస్తం
నువ్వే అంతే చాలుగా

నీది నాది ఓ చిరులోకం
నువ్వే నాకు ప్రియ నేస్తం
దైవంకైనా దొరకని బంధం
అమ్మా నువ్వే నా సొంతం

అద్దంలా ఉంటూ అందం నేనంటూ
ముద్దాడేస్తావు ఎంతో ఇష్టంగా

అమ్మా అని అంటే కన్నా అనుకుంటూ
గారం చేస్తావు .. నన్నే ప్రాణంగా

నీ చీర కొంగు చాటుందే నా సంతోషం
నీ కంటి తోనే చూస్తున్నా నేనీ లోకం
ఏ దృష్టి నాకు సోకిందో అని ఆరాటం
నా చుట్టూ ఉంటూ నడిపించే సైన్యం

నీది నాది ఓ చిరు లోకం
నువ్వే నాకు ప్రియ నేస్తం
దైవం కైనా దొరకని బంధం
అమ్మా నువ్వే నా సొంతం

సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: పూర్ణా చారి
గాయకుడు: ఎస్‌. పి. చరణ్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress