కిష్కింధ‌పురి

చుక్కలకు చుట్టనివా
మబ్బులకు సంద్రానివా
నింగి నేల దారే వేసే వర్షానివా.. వర్ణనివా

చక్కనైన చిత్రనివా
రంగులున్న చైత్రనివా
దిక్కులను దాటేదామే నాతో వస్తావా

వాలు చూపుల నీ దాడి
కొల్లగొట్టేనే కుర్రాడ్ని..
తట్టుకోలేను అమ్మాడి..
నువ్వు నేను జోడి..

ఉండిపోవే నాతోనే..
బంగారం.. నీ చిన్ని చిన్ని మాటల వయ్యారం
సింగారం.. అట్టా నువ్వే చూస్తే ఉంది కంగారం
నా గుండెల్లో పిల్లా రేపెవమ్మో ఏదో దుమారం
మందారం.. ఇంకా ఏదేమైనా నీదేలే భారం

కాలాన్నే దాటాలనే కోరిక
ఈ ప్రేమే చూపిస్తుంది దారినలా
మేఘంతో నీకున్నది పోలిక
ఓ చూపే తాకిందంటే వాలునలా

అగ్గిపుల్లకే పుసావేమో పువ్వులా
ఎంత ముద్దుగా ఉన్నావే చూడగా
చందమామకే ఇంకోవైపు నువ్వలా
అచ్చువేసినా బొమ్మల్లే మారగా

కన్నే చూపుల సాంబ్రాణి
తెంచివేసేనే దూరాన్ని
నన్ను చేసేనే నీవాడ్ని
నువ్వే నేను కానీ

ఉండిపోవే నాతోనే..
బంగారం.. నీ చిన్ని చిన్ని మాటల వయ్యారం
సింగారం.. అట్టా నువ్వే చూస్తే ఉంది కంగారం
నా గుండెల్లో పిల్లా రేపెవమ్మో ఏదో దుమారం
మందారం.. ఇంకా ఏదేమైనా నీదేలే భారం

సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: పూర్ణా చారి
గాయకుడు:
జావేద్ అలీ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress