బ‌రాబ‌ర్ ప్రేమిస్తా

ఏదో ఏదో షురువయింది ఎదలో ఎప్పుడు లేదే
నాతో నాకే గొడవైతాంది ఏమయిందే
ఏనాడు లేంది ఈ గోలే ఏంది
ఏదోలా ఉంది నీ వ‌ల్లే నాలోన మొద‌ల‌యింది ఈ రంది

ఏదో ఏదో షురువయింది ఎదలో ఎప్పుడు లేదే
నాతో నాకే గొడవైతాంది ఏమయిందే

ఏ గాలి సోకిందో.. ఏ ధూళి తాకిందో..
నే తేలి పోతున్న గాల్లో..
ఆగేలా లేకున్నా మేఘాల పైనున్నా
ఈ వేగమే ఏంటో లోలో..

అలికి ముగ్గులేసిన అలికిడాయే మ‌న‌సున‌
ఉలికి పడుతూ చూసిన
ఉండుండి గుండెల్లో ఈ గడబిడ ఏందోనా

ఏదో ఏదో షురువయింది ఎదలో ఎప్పుడు లేదే
నాతో నాకే గొడవైతాంది ఏమయిందే

సింగిడిలో రంగులకే రంగులద్దినట్టు
ఒళ్ళంతా చమ్కీల వానా..
సమ్మక్క సారక్క జాతర జరిగినట్టు
సందడిగా ఉందంట చానా..

మనువు మనకు ఎప్పుడు అని.. అడిగె గుండె సప్పుడు
చనువు కొద్ది ఇప్పుడు.. న‌న్ను చుట్టూ ముట్టేసి ఒట్టేసి క‌ట్టుకో

ఏదో ఏదో షురువయింది ఎదలో ఎప్పుడు లేదే
నాతో నాకే గొడవైతాంది ఏమయిందే
ఏనాడు లేంది ఈ గోలే ఏంది
ఏదోలా ఉంది నీ వ‌ల్లే నాలోన మొద‌ల‌యింది ఈ రంది

సాహిత్యం : ఆర్ ఆర్ ధ్రువ‌న్‌
సంగీతం : సురేష్ గంగుల‌
గాయ‌కులు :
మోహ‌న భోగ‌రాజు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress