ఎన్నో ఎన్నెన్నో మలుపులు
ఎన్నో ఎన్నెన్నో మార్పులు
ఎన్నో ఎన్నెన్నో పిలుపులు
ఎన్నో ఎన్నెన్నో తలపులు
నవ్వులు ఓ చోట.. రాలే పువ్వులు ఓ చోట
జారే మనసే ఓ చోట… గుండె తడిచెనోచోట
ఎప్పుడు వస్తామో.. మళ్ళీ ఎన్నడు చూస్తామో
రెప్పల మాటున దాస్తామో.. గుర్తులాగ మోస్తామో
హే… యా… పయనమే సాగే ఈ పయనమే
చేరే ఏ గమ్యమే పయనమే పయనమే
హే… యా… పయనమే బాగుందీ పయనమే
తాకే ఏ తీరమే పయనమే పయనమే
ఏ నిమిషంలో ఏమవుతుందో
ఏ మజిలీ ఎంతసేపు నేస్తమవుతుందో
ఎవరెవరో చేరి పరిచయమే మారి
దూరాలే కలిపేటి దారాలై
దగ్గరకే వచ్చి ఎగిరే రెక్కలనే ఇచ్చి
కొత్త లోకం చూపించి జ్ఞాపకమైతారు నచ్చి
హే… యా… పయనమే సాగే ఈ పయనమే
చేరే ఏ గమ్యమే పయనమే పయనమే
హే… యా… పయనమే బాగుందీ పయనమే
తాకే ఏ తీరమే పయనమే పయనమే
మళ్ళీ మళ్ళీ ఆ ఊహలే ఎదపైనే వాలి
సీతాకోకలవుతుంటే
అటు వీచే గాలి ఇటు వైపే తుళ్లీ
పెదవుల పై ఓ పాటై మురిసిందే
ఉండక ఓ చోట ఏమి తోచక ఓ చోట
కాలం కదలదు ఈ పూట అర్థం కాదే ఈ ఆట
హే… యా… పయనమే సాగే ఈ పయనమే
చేరే ఏ గమ్యమే పయనమే పయనమే
హే… యా… పయనమే బాగుందీ పయనమే
తాకే ఏ తీరమే పయనమే పయనమే
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గాయకులు: అనూప్ రూబెన్స్, సత్య ప్రకాష్
