రెండు జల్లా ఓ మొలక పెళ్లి కూతురై పోయావ్
అయినా ఏం మారనే లేదే ఇంకా అట్లాగే ఉన్నావ్
అమ్మో నీ గడుసుతనము అందరికీ తెలిసిందేలే
కళ్లెం లేని గుర్రంలాగా ఈ దూకుడు చాలే
ఆ నోట ఈ నోట విన్నామే ఈ మాట
నిజమేనా చెవిలోన పట్టావే నచ్చినోన్ని…
ఎంతసేపు ఇట్టాగే కూర్చుంటామే వదినమ్మా
రా ఇక బంగారమా
ఎందుకు ఆలస్యం మనమెంటో చూపిద్దాం
అడుగులో అడుగేస్తూ యువరాణుల్లా
పెళ్లి కూతురా.. ఏం తొందర
ముందుందిలే ముచ్చట
త త త తస్సాదియ్యా
తగ్గేదేలేదు హోయ్యా
అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే
త త త తస్సాదియ్యా
చిరునవ్వుల చిందులెయ్య
మనమాడిందే ఆట
మనని ఆపేదెవరంట చెలరేగిపో
పెళ్లయ్యాక ఎలా ఉంటావో
నీ అల్లరికి అంతు పోతుండదే
నా లాగానే మా అత్తయ్యను
నేను మార్చేసుకుంటానులే
ఆపండే గోల పిల్లలు మీ చిందులు
శుభగడియ దాటి పోతున్నదే
చాలించేయ్ పిల్ల నీ సయ్యాటలు
మెట్టింటిలోన ఇవేమ్ కుదరవే
అంతలేదులే ఆ ఇంటికి
రారాణి నేనే కదా
త త త తస్సాదియ్యా
తగ్గేదేలేదు హోయ్యా
అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే
త త త తస్సాదియ్యా
చిరునవ్వుల చిందులెయ్య
మనమాడిందే ఆట
మనని ఆపేదెవరంట చెలరేగిపో.. చెలరేగిపో
రెండు జల్ల ఓ మొలక పెళ్లి కూతురై పోయావ్
అయినా ఏం మారనే లేదే ఇంకా అట్లాగే ఉన్నావ్
అమ్మో నీ గడుసుతనము అందరికీ తెలిసిందేలే
కళ్లెం లేని గుర్రంలాగా ఈ దూకుడు చాలే..
ఓ…
సంగీతం: సంతోష్ నారాయణన్
సాహిత్యం: రెహమాన్
గాయకులు: చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ
