సంచారమే ఎంతో బాగున్నది
దీనంత ఆనందం ఏమున్నది
సంచారమే ఎంతో బాగున్నది
ఊరు నిడిచి గాలి మోటారెక్కినాది
మొట్టు మనుషుల నిడిచి స్వీట్ మనుషుల చేరి
మనసు నమ్ముకుంది వెంకటేశ్వర స్వామి
నడిమిట్ల కలిసెన ప్రేమల సుకుమారి సంచారమే..
సంచారమే ఎంతో బాగున్నది
దీనంత ఆనందం ఏమున్నది
సంచారమే ఎంతో బాగున్నది
బస్సు మీద బస్సే పోతున్నది
లండను అందము భలే ఉన్నది
అందాల చిత్రాంగి తోడున్నది
టవరు మీద టవరే ఇడున్నది
తోకవల్లే పువ్వులల్లినది సంచారమే..
కోహినూరు కోట ఇడున్నది
జంటగా మహారాణి తోడున్నది
గంటకోక ఫోటో దిగుతున్నది
మనసంత ఆనందం అయితున్నది
కడుపు నిండినట్టే ఉంటున్నది
బుద్ధివుట్టి బువ్వ తింటున్నది
తొలి తొలి ప్రేమలు తొలకారి మాటలు
సలిసాలి మెట్టంగా సాగర తీరాన సంచారమే..
ఊరు గాని ఊరు వాడ గాని వాడ
పల్లె గాని పల్లె దేశం గాని దేశం
లండను రాజ్యం రామసిలకల తేరు
సిట్టి ఎలుకల పోరు మునివెళ్తాదో ముదును దిగిపోతదో
సంచారమే..
అనుకున్నది ఒకటంట అయితున్నది ఒకటంట
జిందగీ జీనేకా ముష్కిలో…
జిందగీ జీనేకా ముష్కిలో…
జిందగీ జీనేకా ముష్కిలో…
సంచారమే..
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
సాహిత్యం: గోరటి వెంకన్న
గాయకులు : గోరటి వెంకన్న, హేషమ్ అబ్దుల్ వహాబ్
