బెల్లం చుట్టూ ఈగ లెక్క…
మంచం చుట్టూ దోమ లెక్క…
బెల్లం చుట్టూ ఈగ లెక్క
మంచం చుట్టూ దోమ లెక్క
గుడి చుట్టూ భక్తుని లెక్క
బారు చుట్టూ తాగుబోతు లెక్క..
తిప్పుకుంటాన్నవ్.. తిప్పుకుంటాన్నవ్
నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పుకుంటాన్నవ్
యహే తిప్పుకుంటాన్నవ్.. తిప్పుకుంటాన్నవ్
నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పేస్కుంటన్నావ్
పచ్చని లంగా చుట్టి ఎరెర్రనీ వోణి ఏసి
చెవులకు కమ్మలు పెట్టి అరె కాళ్లకు పట్టీలు కట్టి
పచ్చని లంగా చుట్టి ఎరెర్రనీ వోణి ఏసి
చెవులకు కమ్మలు పెట్టి అరె కాళ్లకు పట్టీలు కట్టి
అరె కొబ్బరికాయ బుట్ట పట్టుకొని కోవెలకే నువ్ పోతూ
నా తలకాయలా గత్తర లేపి గాబరా నన్నే చేస్తూ
సూర్యుని చుట్టూ భూమి లెక్క
పైసల చుట్టూ మనుషుల లెక్క
తిప్పు అరె తిప్పు అబ్బా తిప్పుకుంటాన్నవ్.. తిప్పు తిప్పుకుంటాన్నవ్
నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పుకుంటాన్నవ్
అరె తిప్పుకుంటాన్నవ్.. తిప్పుకుంటాన్నవ్
నన్నే నీ వెనక తిప్పు తిప్పేస్కుంటన్నావ్
కళ్ళే ఎగిరేస్తుంటావ్..
ఇంతలో పళ్లే నూరుతూ ఉంటావ్
అల్లరి చేస్తూ ఉంటావ్..
అంతలో చల్లని మాటలు చెబుతావ్
కళ్ళే ఎగిరేస్తుంటావ్..
ఇంతలో పళ్లే నూరుతూ ఉంటావ్
అల్లరి చేస్తూ ఉంటావ్..
అంతలో చల్లని మాటలు చెబుతావ్
అందరి కంటే చిన్న మొల్లిలా అలిగి నువ్ కూసుంటావ్
సందే దొరికితే పెద్ద మనిషిలా పెత్తనమే చేస్తుంటావ్
ఎన్నో ఎన్నో ఏషాలేసి దీపం చుట్టూ పురుగును చేసి
తిప్పు.. ఏం తిప్పుతున్నవే ?
తిప్పుకుంటాన్నవ్.. తిప్పుకుంటాన్నవ్
నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పుకుంటాన్నవ్
యే తిప్పుకుంటాన్నవ్.. తిప్పుకుంటాన్నవ్
నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పు తిప్పేస్కుంటనావ్
కోడి చుట్టూ గద్ద లెక్క
చంద్రుని పట్టిన గ్రహణం లెక్క
ఓయ్ కోడి చుట్టూ గద్ద లెక్క
చంద్రుని పట్టిన గ్రహణం లెక్క
పంటల్లో తెగులు లెక్క
తగులుకోకు నువ్ నా ఎనక
ఇడిసి పెట్టేసేయ్.. ఇడిసి పెట్టేసేయ్
నా యెంట పడక ఇడిసి ఇడిసి పెట్టేసేయ్
పెట్టేసేయ్.. ఇడిసి పెట్టేసేయ్
నన్నే నా మానాన ఇడిసి పెడితే పోతానోయ్
సంగీతం : విజయ్ బుల్గానిన్
సాహిత్యం : చంద్రబోస్
గాయకులు: రాము రాథోడ్ , అదితి భావరాజు
