ఫంకీ

ఉన్నమాట పైకి చెప్పనంటూ
లోపలేమో పైకి ఒప్పుకుంటూ
నువ్వలా.. ప్రేమించవే..

ముద్దు ముద్దుగా తిట్టుకుంటూ
ముందరున్న నన్ను తప్పుకుంటూ
సరేలే.. ఊరించవే…

గుప్పెడంత గుండెకెంత గుట్టు
ఎందుకంట దానికంత బెట్టు
నీకు నువ్వే చేరి చేయి పట్టేదాకా నే వేచి ఉంటానులే…

ధీరే ధీరే తూ.. ధీరే ధీరే తూ..
దిల్లో ఆగయీ… మేరా దిల్లే లేగయీ
ధీరే ధీరే తూ.. ధీరే ధీరే తూ..
దిల్లో ఆగయీ… మేరా దిల్లే లేగయీ

నిండుగా కళ్లల్లో నీదే కల
నిజమై నన్నదీ చేరేదెలా..
వేడిగా ఉన్నదే నీ వెన్నెలా
చల్లగా నన్నదీ తాకేదెలా..

లోకమంతా నన్నే చూసే ఎదురుచూపై మిగిలానే
తలుచుకుంటూ నిన్నే నిన్నే
ఓ.. ఓ.. ఓ… ఓ…
నువ్వు లేని నీ ఊహల్లో క్షణాలన్నీ గడిపానే
అంతకన్నా పనేం లేదులే.. ఈ ఆవారాకీ

ధీరే ధీరే తూ.. ధీరే ధీరే తూ..
దిల్లో ఆగయీ… మేరా దిల్లే లేగయీ
ధీరే ధీరే తూ.. ధీరే ధీరే తూ..
దిల్లో ఆగయీ… మేరా దిల్లే లేగయీ

చుట్టుపక్క నన్ను చుట్టుకుంటూ
విచేగాలిలాగా వెంట ఉంటూ
మాయే.. చేశావులే…

ఎవ్వరేమి అన్న పట్టదంటూ
నమ్ముకున్న ప్రేమ గట్టిదంటూ
నన్నే.. గెలిచావులే…

నువ్వు నేను ఇంక ఒక్కరంటూ
గుండెలోన చోటు రాసిపెట్టు
రంగు మారి చెంగు చెంగు చెంగుమంటూ నీ జంటకొస్తానులే…

ధీరే ధీరే తూ.. ధీరే ధీరే తూ..
దిల్లో ఆగయీ… మేరా దిల్లే లేగయీ
ధీరే ధీరే తూ.. ధీరే ధీరే తూ..
దిల్లో ఆగయీ… మేరా దిల్లే లేగయీ

సంగీతం : భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం : అనుదీప్ కేవీ
గాయకులు: సంజిత్ హెగ్డే, రోహిణి సోరట్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress