మోగ్లీ 2025

తీర తారే తారే తారే తనేనా తన్నానే
తీర తారే తారే తారే తనేనా తన్నానే
ఓ నువ్వు చెప్పని మాట మనసారా వింటున్నా
నువ్వు పాడని పాట నీకే వినిపించైనా
మాటిదని అలవాటిదని అననా.. అననా..

సయ్యరే సరికొత్త లోకంలోకి
సయ్యరే సరదాలకి
సయ్యరే చిరుగాలి గుర్రం ఎక్కి
సయ్యరే సవ్వారికి
సయ్యరే చిరునవ్వుల చేతికి చిక్కి
సయ్యరే నూరేళ్లకి

సయ్యరే సరికొత్త లోకంలోకి
సయ్యరే సరదాలకి

ఏ భాషంటూ లేనే లేని జగానా.. ఉందామే
ఏ బాధంటూ రానే రాని స్థలానా.. ఉందామే

ఎన్నెన్నో ఉన్నాయంట చూపులు
ఇంకెన్నో ఉన్నాయంట సైగలు
చూపుల్లో సందేశాలు సైగల్లో సంభాషణలు సరిపోవా..
వద్దంట నీకు నాకు మాటలు
ర‌ద్దంట ఇద్దరి మధ్య.. లు
నా గుండె చప్పుడు నీకు..
గుండె చప్పుడు నాకు సరిపోదా..

చందమామ వెలిగిస్తుంది ఏ సడి లేక
సవ్వడి లేక అలజడి లేక
నిండు ప్రేమ వెలికొస్తుంది ఏకాంతంగా
నిస్వార్ధంగా నిశబ్దంగా..

పువ్వుల్లోనా ధ్వని ఉంటుందా
రంగులోనా ధ్వని ఉంటుందా
శ్వాసలోనా ధ్వని ఉంటుందా
ప్రాణంలోనా ధ్వని ఉంటుందా
ప్రేమాల్లోనా ఈ శబ్దకాలుష్యాల అవసరముందా..

సయ్యరే సరికొత్త లోకంలోకి
సయ్యరే సరదాలకి
సయ్యరే చిరుగాలి గుర్రం ఎక్కి
సయ్యరే సవ్వారికి
సయ్యరే చిరునవ్వుల చేతికి చిక్కి
సయ్యరే నూరేళ్లకి

సయ్యరే సరికొత్త లోకంలోకి
సయ్యరే సరదాలకి
సయ్యరే.. హో హో సరదాలకి
సయ్యరే..ఓ హో హో…

సంగీతం : కాల భైరవ
సాహిత్యం : చంద్రబోస్
గాయకులు : కాల భైరవ, ఐశ్వ‌ర్య ద‌రూరి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress