డ్యూడ్‌

నీ ఇష్టం సర్లే కానీ
ఇచ్చేశా నిన్నే నీకే
ఆనందంగా బతకవే పో..
తీరేదే కాదే నా ప్రేమ
ఆరిపోని వెన్నెలే మారిపోనే పోదులే

నీ ఇష్టం సర్లే కానీ
ఇచ్చేశా నిన్నే నీకే
ఆనందంగా బతకవే పో..
ఈ భారం పోయేదే కాదే
అయినా చెలి సెలవంటున్నానే

ఏ రేపు నీ చూపు
నావైపు రాకున్నా వెయ్యేళ్ళు బాగుండుపో
ఏకాకి లోకనా ఎలాగా
నేనున్నా నువ్వైనా బాగుండుపో

గాయమే కానీవే
గుండెలే పెరికేసానే
నిన్ను నీకిచ్చానే నవ్వుతూనే
ఎవ్వరినీ ఏమంటానే
నేరమే నాదంటానే
శిక్షగా చివరంటానే
శూన్యమై మిగిలుంటానే

వేరొకరి చేతుల్లో
నీ చెయ్యి చూస్తున్నానే
బరువుగా నిట్టూర్చా బాధలోనే
నిన్న నీ కన్నుల్లోనే
కాటుకై ఉన్నది నేనే
నా కంటి నీళ్లతో నన్నే
నేడిలా చేరిపేసావే

ఏ రేపు నీ చూపు
నావైపు రాకున్నా వెయ్యేళ్ళు బాగుండుపో
ఏకాకి లోకనా ఎలాగా
నేనున్నా నువ్వైనా బాగుండుపో

ఇంకెవరితోనో నీ జంట
నువ్వులేని నాకు ఎదమంట
ముక్కలైన నాకు దిక్కు తోచదంట
అయినా వెళ్ళిపో

నన్ను దాటి పోవే పొమ్మంటా
మళ్లీ ఇటు రానే వద్దంటా
అంతులేని ప్రేమ అక్షతలు వేసి
దీవించాలే పో

సంగీతం: సాయి అభ్యాంకర్
సాహిత్యం: “సరస్వతి పుత్ర” రామజోగయ్య శాస్త్రి
గాయకుడు :
సంజిత్ హెగ్డే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress