కలలే కలలే..
కనులకి నువ్వు కనబడి కలలే కలలే
కథలే మొదలే వివరములే తెలియాలే..
కలలే కలలే..
కనులకి నువ్వు కనబడి కలలే కలలే
కథలే మొదలే వివరములే తెలియాలే..
నా గుండెకేదో కబురే నీ వల్లే అందిందే
నీ చుట్టూ చుట్టూ తిరిగేలా చేసిందే..
నా తోటే ఉండే మనసే
నా మాటే వినకుందే
నీ తోటే జట్టు కడుతోందే కడుతోందే..
అందాల మాయ కళ్ళే కాదా..
ఊసులేవో నాలో పూసగుచ్చేలా..
నన్నే అద్దంలో చూస్తుంటే
నిన్నే చూపిస్తుందే..
రోజంతా అద్దంతో ఇబ్బందే..
ఏయ్ నీ గుండె నాలోనే..
అందంగా దాక్కుందే
నా కొంచెం చోటైనా లేకుందే..
నీ చూపు గాలలు వేసే చేసావు బాణమతే
నా దారి మారిందిలే పిల్లా నీ వలనే
గారాలు పోయేటి గాలే..
రాగాలు పాడిందిలే
నాలోని ప్రాణాలిలా ఉప్పొంగిపోయే వాగల్లే..
నువ్వెల్లే తోవల్లో మందారం పూసిందే
నాలోన నాకంటే నువ్వుంటే బాగుందే
నన్నే అద్దంలో చూస్తుంటే
నిన్నే చూపిస్తుందే..
రోజంతా అద్దంతో ఇబ్బందే
ఏయ్ నీ గుండె నాలోనే
అందంగా దాక్కుందే
నా కొంచెం చోటైనా లేకుందే..
ఏ పేరు పెట్టాలో ఏమో నాలోని ఈ హాయికే
ఆకాశం అందిందిలే ఊగే ఊహలకే
ఆరారు కాలాలు నిన్నే చూసేలా చేసావులే
దూరాల దారాలిలా..
తెంపేసి పోవే ఇవ్వాలే
ఏదో ఆద మరుపే నాలో చేరిందే
కాలం ఎంతో సాయం చేసిందే
హే.. నే.. అద్దంలో చూస్తుంటే
నిన్నే చూపిస్తుందే..
రోజంతా అద్దంతో ఇబ్బందే
ఏయ్ నీ గుండె నాలోనే
అందంగా దాక్కుందే
నా కొంచెం చోటైనా లేకుందే
సంగీతం : చైతన్ భరద్వాజ్
సాహిత్యం: భాస్కరబట్ల
గాయకుడు: కపిల్ కపిలన్
