దే కాల్ హిమ్ ఓజీ

ఉండిపోవా ఉండిపో ఇలాగా
తోడుగా నా మూడు ముళ్లలాగా
నిండిపోవా నీడలగా నీలాగా

ఉండీ రెండుగానే ఒక్కటైనా ముడిలాగా
ఉండీ రెండుగానే ఒక్కటైనా ముడిలాగా

విడివిడిగానే అడుగులు ఉన్నా
విడిపడలేని నడకల లాగా
ఎవరు రాయని ప్రేమకథ ఇది
మొదలు మనమని నిలబడిపోగా

సువ్వి సువ్వి సువ్వలా సూదంటు రాయే పిల్ల
మళ్లీ మళ్లీ చూసెలా చేసిందే మాయే ఇల్లా
సువ్వి సువ్వి సువ్వలా సూదంటు రాయే పిల్ల
మళ్లీ మళ్లీ తలచేలా నచ్చావే చాలా చాలా

ఉండిపోవా ఉండిపో ఇలాగా
తోడుగా నా మూడు ముళ్లలాగా
నిండిపోవా నీడలాగా నీలాగా
ఉండీ రెండుగానే ఒక్కటైనా ముడిలాగా

నిదుర సరిపోని కలతలకి
బదులు విసిరేటి నవ్వులకి
నిజముల కలలే మారుతుంటే
సమయం అసలే చాలదే

ఇక చివరే లేదను ప్రేమ మనదని
మనసు తెలిపిన తరుణమిలాగా

సువ్వి సువ్వి సువ్వలా సూదంటు రాయే పిల్ల
మళ్లీ మళ్లీ చూసెలా చేసిందే మాయే ఇల్లా
సువ్వి సువ్వి సువ్వలా సూదంటు రాయే పిల్ల
మళ్లీ మళ్లీ తలచేలా నచ్చావే చాలా చాలా

ఉండిపోవా ఉండిపో ఇలాగా
తోడుగా నా మూడు ముళ్ల లాగా
నిండిపోవా నీడలాగ నీలాగా
నిండిపోవా నీడలాగ నీలాగా
ఉండీ రెండుగానే ఒక్కటైనా ముడిలాగా
ఉండీ రెండుగానే ఒక్కటైనా ముడిలాగా

సంగీతం: థమన్ ఎస్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి
గాయని : శృతి రంజని

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress