సూర్యుడినే బ్రతిమాలి రావొద్దంటానే
నీకు నిద్దర సరిపోకుంటే.. ఆహా
ఓ సంద్రంలో ఉప్పంతా తొలగించేస్తానే
నువ్వు స్నానం చేస్తానంటే.. అబ్బో
సూర్యుడినే బ్రతిమాలి రావొద్దంటానే
నీకు నిద్దర సరిపోకుంటే
ఓ సంద్రంలో ఉప్పంతా తొలగించేస్తానే
నువ్వు స్నానం చేస్తానంటే
మట్టినంత పూలగుట్టగా మార్చివేస్తానే.. ఓహో
మట్టినంత పూలగుట్టగా మార్చివేస్తానే
నువ్వు నేలపైన నడిచెలితే
నువ్వు నేలపైన నడిచెలితే
మబ్బుతెరల పందిరేసి నీడ తెస్తానే…
నువ్వు ఎండలోకి వెళ్తుంటే
నువ్వు ఎండలోకి వెళ్తుంటే…
ఇలా చూసుకుంటానే
ఇలా చూసుకుంటానే
చెలి నిన్ను కలకాలం
ఇలా చూసుకుంటానే…
ఇలా చూసుకుంటానే
ఇలా చూసుకుంటానే
నువ్వే నమ్మలేనంత
నిన్నే చూసుకుంటానే…
ఓ.. గాజులనే కోరుకుంటా
గట్టిగ నీ చెయ్ తాకవద్దని
వాలుజడని వేడుకుంటా
నీ వీపుని వేధించవద్దని
పట్టీలను ప్రార్థిస్తుంటా
పట్టీ పట్టీ నొక్కవద్దనీ
పట్టీలను ప్రార్థిస్తుంటా
పట్టీ పట్టీ నొక్కవద్దనీ…
గొలుసుతోటి గొడవేస్కుంటా…
గొలుసుతోటి గొడవేస్కుంటా
ఒరుసుకుంటె నేనూరుకోననీ
ఒరుసుకుంటె నేనూరుకోననీ
ఇలా చూసుకుంటానే
ఇలా చూసుకుంటానే
చెలీ నిన్ను కలకాలం
ఇలా చూసుకుంటానే…
ఇలా చూసుకుంటానే
ఇలా చూసుకుంటానే
నువ్వే నమ్మలేనంత
నిన్నే చూసుకుంటానే…
కన్నీళ్ళనే అడుగుతానే
నవ్వుల్లోనే రావాలని…
విరహాన్నే అడుగుతానే
వచ్చీపోతూ ఉండాలని
దూరాన్నే అడుగుతానే
ఏడడుగులతో ఆగాలని
దూరాన్నే అడుగుతానే
ఏడడుగులతో ఆగాలని
మరణాన్నే అడుగుతానే…
మరణాన్నే అడుగుతానే…
ఇద్దరికీ ఒకేసారి రావాలని
ఇద్దరికీ ఒకేసారి రావాలనీ
ఇలా చూసుకుంటానే
ఇలా చూసుకుంటానే
నువ్వే నమ్మలేనంత
నిన్నే చూసుకుంటానే
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గాయకులు : సిద్ శ్రీరామ్, అనూప్ రూబెన్స్, రచిత (డైలాగ్స్)
