నేనూ నువ్వన్న పదము
లేదే ఉందల్లా మనము
ప్రేమై పొంగెనే ఇద్దరి ఎదలు.. ఎదలు..
రానా నీడల్లే జతకు
కానా నీ కంటి వెలుగు
రాదే నేనుంటే నీకు దిగులు.. దిగులు..
కళ్ళముందు నువ్వుండగా
రెప్పకూడ పడదుగా
నువ్వు తప్ప ఇంకెవ్వరూ కనపడరే
నే ప్రాణమైతే ఊపిరి నువ్వే
జన్మాలెన్నైన నీతోనే మొదలే
యుద్ధమే రానీ సిద్ధమై ఉన్నా
విడువనంటా నీ చెయ్యే..
ఎవ్వరు నన్నే ఏమనుకున్నా
చివరిదాకా నీతోనే..
నేను నువ్వన్న పదము
లేదే ఉందల్లా మనము
ప్రేమై పొంగెనే ఇద్దరి ఎదలు.. ఎదలు..
ఇరువురి తనువులకు
ఒకటే హృదయములే
వరమై ఊహలకే
నువు దొరికావులే
నీతో గడపనిదే
సమయం గడవదులే
తలచిన మరుక్షణమే
ఎదురవుతావులే
ఆపగలనా మదినే
నిన్ను చూస్తే చెలియా
మోయగాలనా బాధే
కలవకుంటే సఖియా
గోరంత కూడా బంధించలేనే
నీపై నాకున్న కొండంత ఇష్టాన్ని
యుద్ధమే రానీ సిద్ధమై ఉన్నా
విడువనంటా నీ చెయ్యే..
ఎవ్వరు నన్నే ఏమనుకున్నా
చివరిదాకా నీతోనే..
చివరిదాకా నీతోనే..
ఇంత దగ్గరై ఇద్దరం
కలిసుండాలని
ముందుగానే రాసి ఉంది
తెలుసా
రేయి పవలూ ఒక్కటై
పయనించాలని
వందయేళ్ళ జీవితముకే ఆశా
అలల నదిలా మనమే
కలల వెనుకే వెళదాం
పెదవి చివర నవ్వై
సెకనుకొకలా పుడదాం
రాజల్లే నేను రాణల్లే నువ్వు
ఆనందాలన్నీ ఏలాలి ఆశాంతం
ప్రేమొక సత్యం ప్రేమొక స్వర్గం
ప్రేమించడమో వరమేలే
ప్రేమొక ధైర్యం ప్రేమదే విజయం
ప్రేమకు అర్థం మనమేలే
నేను నువ్వన్న పదము
లేదే ఉందల్లా మనము
ప్రేమై పొంగెనే ఇద్దరి ఎదలు..
సంగీతం: అర్జున్ జన్య
సాహిత్యం : సనారే
గాయకులు: సిద్ శ్రీరామ్, శిరీష
