జాన‌పద‌ క‌ళ‌కు నివాళిగా వ‌స్తున్న సినిమాలో ఆనంది ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌!

ఇంట గెలిచి.. ర‌చ్చ‌గెలువాల‌న్న‌ది సామెత‌. కానీ మ‌న తెలుగు హీరోయిన్లు ముందు త‌మిళంలో స‌క్సెస్ సాధించి తెలుగు తెర మీద స‌త్తా చాటుతున్నారు. అందులో ఆనంది ఒక‌రు. ఆమె ఇప్పుడు ఒక జీవ‌త‌క‌థ ఆధారంగా తెర‌కెక్క‌నున్న సినిమాలో క‌నిపించబోతున్న‌ది.

ఈరోజుల్లో.. బ‌స్టాప్‌తో తెలుగు తెర‌పై మెరిసిన భామ ఆనంది. ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు చేసినా ఆమెకు పెద్ద‌గా తెలుగు తెర అచ్చి రాలేదు. కానీ త‌మిళంలో బిజీ హీరోయిన్‌గా మాత్రం చాన్నాళ్లుగానే కొన‌సాగుతున్న‌ది. భైర‌వం సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకొందీ అమ్మ‌డు. ఇప్పుడు వ‌రుస తెలుగు సినిమాలు అనౌన్స్ చేస్తున్న‌ది. ఒక‌టి ప్రియ‌ద‌ర్శితో క‌లిసి ప్రేమంటే సినిమా అనౌన్స్ చేసింది. మ‌రొకటి బుర్ర‌క‌థ క‌ళాకారిణి జీవ‌తక‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న సినిమా గ‌రివిడి ల‌క్ష్మి.

View this post on Instagram

A post shared by @peoplemediafactory

ఆనంది త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. అందులో లంగాఓణీ గెట‌ప్‌లో రిక్షాలో కూర్చొని, చేతిలో హార్మోనియం ప‌ట్టుకొని ప‌ల్లె ప‌డుచులా క‌నిపిస్తున్న‌ది. న‌వ్వుతూ క‌నిపిస్తున్న ఈ ఫోటోకి ఆనంది మన గరివిడి లక్ష్మి ఒచ్చేసింది.. ఇక స్టేజిరెక్కి అగ్గిదీసేద్దంతే! అంటూ క్యాప్ష‌న్ జ‌త చేసింది.

జానపద కళకు నివాళిగా.. ఉత్తరాంధ్ర బుర్ర కథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా ఈ సినిమాలో ఆనంది టైటిల్‌ రోల్‌ని పోషిస్తున్నది. గౌరీనాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, కృతిప్రసాద్‌ నిర్మిస్తున్నారు. చ‌ర‌ణ్ అర్జున్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. రాగ్‌మ‌యూర్‌, న‌రేశ్‌, రాశి, శ‌ర‌ణ్య ప్ర‌దీప్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress