క‌న్న‌ప్ప‌

జనులారా వినరారా కాళహస్తి గాథ.. శ్రీ కాళహస్తి గాథ
జనులారా వినరారా కాళహస్తి గాథ.. శ్రీ కాళహస్తి గాథ
కనులారా మనసారా కనిన జన్మ ధన్యమేకదా.. ఈ కథ
తాండవం శివ తాండవం.. పార్వతీ పరమేశ్వరం
కరుణాకర.. గంగాధర.. నీలకందర..
శంకర.. శివ శంకర..
శంకర.. అభయంకర..

జనులారా వినరారా కాళహస్తి గాథ.. శ్రీ కాళహస్తి గాథ
జనులారా వినరారా కాళహస్తి గాథ.. శ్రీ కాళహస్తి గాథ
కనులారా మనసారా కనిన జన్మ ధన్యమేకదా.. ఈ కథ
తాండవం శివ తాండవం.. పార్వతీ పరమేశ్వరం
కరుణాకర.. గంగాధర.. నీలకందర..
శంకర.. శివ శంకర..
శంకర.. అభయంకర..

పరమ శివుని భక్తుడొకడు సాలెపురుగు జన్మనెత్తి
గుడిలో శివునికి ఒక గూడు కట్టెను
అతని భక్తి పరీక్షించి పంతముగల ముక్కంటి
నిప్పు కంటితో పెను మంట పెట్టెను..
భగ భగ భగ మండే లింగము కాపాడ
సాలెపురుగు మంట దూకి ప్రాణమొదలగా..
శివుడు కనికరించి హృదయాన చోటునిచ్చి
కాళహస్తి పేరు మొదట శ్రీ ని చేర్చి శివుడు
శివోహం అను నాదమే నింగి ధ్వనించే
పరమేశ్వర లీలతో నేల తరించే..
నీ లీలా… శివ లీలా.. పలికేలా దీవించు నీలకందర
శంకర.. శివ శంకర..
శాంభవ.. అభయంకర..

దర్పముగల సర్పమోకటి తలపై గల మణులు తెచ్చి
పరమ భక్తితో శివ పూజ చేసెను
తనదే గొప్ప పూజ యనుచు ఏనుగొకటి తొండముతో
మణులను తోసి జల సేవ సలిపెను
పగ పట్టిన నాగం తొండములో దూరే
తాల లేక ఏనుగు త‌ల‌ శిలకు మోదెను
గజము నాగుపాముల త్యాగాలను మెచ్చి
శ్రీ తో పాటు కాళహస్తి పదము నిలిపే హరుడు
శివోహం అను నాదమే నింగి ధ్వనించే
పరమేశ్వర లీలతో నేల తరించే
నీ లీలా… శివ లీలా.. పలికేలా దీవించు నీలకందర
శంకర.. శివ శంకర..
శాంభవ.. అభయంకర..

సాలేడు దారాలను ఎంగిలి అనడు శివుడు
గజము జలములు అనలేదు బురదని
పరమ హంసలందించే పంచామృతమైన సరే
అడవి బిడ్డల మధు మాంసలైన
భక్తి ఒకటి చూసి మనసెంటో తెలిసి
మూడింటికి ఆ శివుడు ముక్తి నొసగెను
ఏ భేదము లేక మోక్షలను ఇచ్చే
ఒకే ఒకడు ఈ జగతిలో పరమేశ్వరుడు
శివోహం అను నాదమే నింగి ధ్వనించే
పరమేశ్వర లీలతో నేల తరించే
నీ లీలా… శివ లీలా.. పలికేలా దీవించు నీలకందర
శంకర.. శివ శంకర..
శాంభవ.. అభయంకర..

సంగీతం: స్టీఫెన్ దేవస్సీ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గాయ‌కులు : అరియానా మంచు, వివియానా మంచు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress