చూడు చూడు పారుతున్న సెలయేరు ఏమంటుంది..
తుళ్లి తుళ్లి ఆడుకుంటూ ఏ చోట ఆగను అంది..
నింగిలోని నీలిమేఘమేమి అన్నది
రాగాలు పాడుకుంటూ హాయిగా
తేలి తేలి పొమ్మన్నది
నాతో కలిసి రమ్మన్నది
గాలిలోన గువ్వలాగా నిను ఆడుకోమన్నది
ఏలేలేలో ఏలేలేలో
ఏలేలే ఏలేలో ఏలేలేలో
ఏలేలేలో ఏలేలేలో
ఏలేలే ఏలేలే ఏలేలేలో
ఎండా వానా వస్తూ ఉన్నా
పగలూ రేయి అయిపోతున్నా
సీతాకోక రెక్కల్లోనా
ఎగిరెళ్లె చిరు ఆశ చల్లారునా
ఉన్నకొంత కాలమైనా నవ్వుతూ అలా
రంగు రంగు పూలలోని తేనె పాటనీ
పాడేస్తూ పూట పూట తియ్యగా
సాగి సాగి పోవాలని
ఆగి పోనే పోరాదని
ఆరి రారో ఆ రా రి రో
ఆరి రారో ఆ రా రి రో
వాలుతున్న పొద్దు నీతో ఓ మాట అంటున్నది
నీకు నువ్వే తోడు ఉంటే ఏ లోటు లేదన్నది
రేయిలోన జాబిలమ్మ పాడుతున్నది
నీకోసం లాలిపాట కమ్మగా
లాలి లాలి జో లాలిజో..
లాలి లాలి జో లాలిజో..
లాలి లాలి జో లాలిజో..
లాలి లాలి జో లాలిజో..
సాహిత్యం : రెహమాన్
సంగీతం : చందు, రవి
గానం : విజయ్ యేసుదాస్