ఓ భామ అయ్యో రామ

రామచంద్రుడే లోక రక్షయని చాటినట్టి పెళ్లి..
బలరామచంద్రుడే పెళ్లి పెద్దగా జరిపినట్టి పెళ్లి..
ఆది దంపతులే ఆత్మసాక్షిగా కలిసినట్టి పెళ్లి..
అలరారుతున్న ఈ పెళ్లి మండపం చూడనుంది మళ్ళీ
సుముహూర్తంతో చూపులు కలిసే చిత్రమైన పెళ్లి
మాంగల్యంతో ముడిపడనుంది ముచ్చటైన పెళ్లి..

వేదాల.. మంత్రాల.. పెళ్లి తంతులో
చూసారా.. ఆనందం.. కొత్త జంటలో
వధువరులు విడి విడి కథలు ఒకటయ్యే ఘట్టము
ఇరువరము ఇక చెరిసగము అని కట్టాలి సూత్రము

నీ వాళ్ళు.. నా వాళ్ళు.. అయ్యారే మన వాళ్ళు
నీదంటూ నాదంటూ లేవే యే భేదాలు
మధురం కన్నా మధురము అయిన వధువుని తాకే మునివేళ్ళు
చిరుతడి తగిలి అన్నాయంట అనలేనెన్నో సంగతులు..

కన్నుల ఎరుపే కనిపిస్తుంటే..
ఎదలో గుబులే వినిపిస్తుందే
తమరికి తోడు నేనున్నాను..
ఇసుమంత కష్టం రానివ్వలేను
పిల్లా పిల్లా మన ఇద్దరి బంధం
పిల్లా పిల్లా ఓ శతమానం

ఆ మాట వింటు లోలో ఎంతో సంబరపడుతున్నా
కోటి ఆశలతో నీవెంటే నే నడిచొస్తా కన్నా

రామచంద్రుడే లోక రక్షయని చాటినట్టి పెళ్లి
బలరామచంద్రుడే పెళ్లి పెద్దగా జరిపినట్టి పెళ్లి
ఆది దంపతులే ఆత్మసాక్షిగా కలిసినట్టి పెళ్లి
అలరారుతున్న ఈ పెళ్లి మండపం చూడనుంది మళ్ళీ
సుముహూర్తంతో చూపులు కలిసే చిత్రమైన పెళ్లి
మాంగల్యంతో ముడిపడనుంది ముచ్చటైన పెళ్లి

ఒడిదుడుకైన త‌డబాటైన కలిసేగా మన ప్రయాణం..
ఒకరికి ఒకరం ఒక‌రికై ఒకరం బ్రతికే తీరునే పెళ్ళంటా

సంగీతం : రాధన్
సాహిత్యం : శ్రీ హర్ష ఈమని, పార్ధు సన్నిధిరాజు
గాయకులు: టిప్పు, హరిణి టిప్పు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress