భైర‌వం

భోగి మంటల్లో తోసేద్దామా బాధ‌లు
కష్టాలు కన్నీళ్లు మోస్తూ ఇంకా ఎన్నాళ్ళు..
హే చుక్కలు కలిపితే ముంగిట్లోన ముగ్గులు
చేతుల్నే కలిపితే బలపడిపోవా బంధాలు..

అరెరే…ఇట్టగా చెలిమి కొరకు
ఎవ్వరూ… అనలేదిదివరకు
అరెరే… ఎంత అన్నదమ్ములైనా
మనలాగా ఉంటారా జల్లెడేసి వెతుకు..

దమ్ దమారే దమ్ దమారే దుమ్మురేగి పోవాలిలే..
సంకురాత్రి పండగొచ్చే సంబరాలే సాగాలిలే..

మిమ్మల్ని చూడగా మనసే నిండిపోయేరా
సంతోషం నట్టింట్లోన చుట్టంలాగా మారేరా
ఏ దిష్టి తగలకుండా పదికాలలా పాటుగా
కలిసి మెలిసి ఉండాలయ్య మీరంతా..

రక్తాన్నీ పంచుకు పుట్టినవాళ్ళేం కాదుగా
స్నేహంతో సావాసం చేస్తున్నారే హాయిగా
కాబట్టే పొరపచ్చాలు మచ్చుకైనా రావుగా
వస్తాయంటే రానిస్తామా మేమంతా..

రాముడిలాగా ఒకడుంటే.. లక్ష్మణుడేగా ఇంకొకడు
ఇద్దరి కోసం నేనుంటా ఆంజనేయుడిలా..
కొండని కొట్టే బలమున్న బలహీనత మీరంటున్న
ప్రేమని పోసి పెంచారే నన్నో తమ్ముడిలా..

అరెరే…ఇట్టగా చెలిమి కొరకు
ఎవ్వరూ… అనలేదిదివరకు
అరెరే… ఎంత అన్నదమ్ములైనా
మనలాగా ఉంటారా కట్టే కాలే వరకుజ..

దమ్ దమారే దమ్ దమారే దుమ్మురేగి పోవాలిలే
సంకురాత్రి పండగొచ్చే సంబరాలే సాగాలిలే..

దమ్ దమారే దమ్ దమారే దుమ్మురేగి పోవాలిలే
సంకురాత్రి పండగొచ్చే సంబరాలే సాగాలిలే..

సంగీతం : శ్రీచ‌ర‌ణ్ పాకాల‌
సాహిత్యం : భాస్క‌ర‌భ‌ట్ల‌
గాయ‌కులు : రేవంత్‌, సాహితీ చాగంటి, సౌజ‌న్య భాగ‌వ‌తుల‌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress