సంచారి సంచారి ఎటువైపో నీ దారి
చిరునామా లేని లేఖలా
చెలి కాటుక చీకటి రేఖలా
సంచారి సంచారి ఎటువైపో నీ దారి
ఏ తోడు లేని నీడగా
కలలన్ని చెయ్ జారీ
కనుపాపలు తడిబారీ
కదిలేవా కాలం జాడగా..
అయ్యో విసిరేసిందా ప్రేమ ఆకాశం
నిన్నే వెలివేసిందా నీ మధుమాసం
మరల రానే వస్తుందా వర్ణాల వసంతం
సంచారి సంచారి ఎటువైపో నీ దారి
ఏ తోడు లేని నీడగా
ఏ తోడు లేని నీడగా
ప్రేమంటే ఇంతేలే అదో సాహసం
ఎందాకైనా సాగలిగా
ఏ లోతైన దిగినాక మునకే సుఖం
కాదంటే కథే లేదుగా
ఆ… ఆ ఆ
మూగాల మథనల నలిగింది నీ ఊపిరి
ఇ పైన నీకైనా మిగిలింది ఒకే ఒక్క దారి..
సంచారి సంచారి ఎటువైపో నీ దారి
ఏ తోడు లేని నీడగా
కలలన్ని చెయ్ జారీ
కనుపాపలు తడిబారీ
కదిలేవా కాలం జాడగా.. ఆ..
ఆచోట ఈ చోట తనే అంతట
తానుందే నీ కలవాటిక
గాయంలో సాయంగా తనే ఊరట
నిన్నెనాడు విడిపోదట
నీలోను తనలోను ప్రేమేగా కొలువున్నది
నీ నుండి నిన్ను చేరే దారేంటో
ఇలా ఎందుకుంది…..
సంగీతం : వివేక్ సాగర్
సాహిత్యం : ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి
గాయకులు : సంజిత్ హెగ్డే